జట్టంతా రాణించలేదు.. పంత్ ఒక్కడినే ఎందుకు బాధ్యుడిని చేయాలి: కోహ్లీ

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ టెస్టు సిరీసులో జట్టంతా రాణించలేదు, ఇందుకు రిషబ్ పంత్ ఒక్కడినే బాధ్యుడిని చేయలేం అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విజయాలను సమష్టిగా ఆనందించాం, ఇప్పుడు ఓటములనూ అలాగే తీసుకుంటాం అని కోహ్లీ తెలిపాడు. పంత్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చాం, అతడి స్థానంలో జట్టు మరొకరిని ప్రయత్నించబోదని కోహ్లీ స్పష్టం చేశాడు. హెగ్లే ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

ఎన్నో అవకాశాలు ఇచ్చాం:
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రిషభ్ పంత్‌కు స్వదేశంలో ఎన్నో అవకాశాలు ఇచ్చాం. చాలా సార్లు బాగా ఆడలేదు. కానీ.. ఎంతో శ్రమించాడు. మరొకరికి అవకాశం ఇచ్చేందుకు సరైన సమయమేదో ముందు తెలుసుకోవాలి. అంతేగానీ అవకాశాలు ఇవ్వకుండా ఒక్కటిరెండు వైఫల్యాలకే జట్టు నుండి వెళ్ళిపోమంటే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది' అని అన్నాడు.

ఒక్కరినే బాధ్యుడిని చేయలేం:
'న్యూజిలాండ్ టెస్టు సిరీసులో జట్టంతా రాణించలేదు. ఒక్కరినే ఇందుకు బాధ్యుడిని చేయలేం. విజయాలను సమష్టిగా ఆనందించాం. ఇప్పుడు ఓటములనూ అలాగే తీసుకుంటాం. జట్టులో ఊరికే ఎవరికీ అవకాశం ఇవ్వరు. ఏం జరిగినా జట్టులో చోటు ఉంటుందని ఏ ఆటగాడూ అనుకోవడానికి వీల్లేదు. బాధ్యతలు తీసుకొని కష్టపడాలని ఎప్పుడో చెప్పాం. అది జరుగుతుందా లేదా అన్నది వేరే విషయం' అని కోహ్లీ పేరొన్నాడు.

పంత్ ఎంతో కష్టపడ్డాడు:
'నేను అన్ని మ్యాచులు ఆడతాను అనే ఉద్దేశంతో ఎవరూ ఉండరు. పరుగులు చేయనప్పుడు రిషబ్ పంత్ ఎంతో కష్టపడ్డాడు. విదేశాల్లో లోయర్ ఆర్డర్‌లో అతడు రాణిస్తాడని మేం అనుకున్నాం. అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయంగా భావించాం. మా ప్రణాళికైతే ఇదే' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ విఫలం:
సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ విఫలమయిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ కేవలం 38 పరుగులే చేశాడు. అతడి సగటు 9.50 మాత్రమే. కెరీర్‌లోనే కోహ్లీకి ఇది రెండో అత్యల్ప సగటు. వన్డే, టెస్టు సిరీస్‌లో విఫలమైన కోహ్లీ.. 11 ఇన్నింగ్స్‌ల్లో 218 పరుగులే చేసాడు. తొలి వన్డేలో మాత్రమే అర్ధ శతకంతో రాణించాడు. ఇక టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 2, 19 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో 3, 14 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications