Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అన్నిసార్లు సాధ్యపడదు: అశ్విన్, జడేజాలకు విశ్రాంతిపై శాస్త్రి

హైదరాబాద్: శ్రీలంకతో ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్‌కు టీమిండియా ప్రధాన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌‌లకు విశ్రాంతి కల్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు.

ప్రతిసారి అశ్విన్‌, జడేజాలతో ఆడలేమని, బోర్డు రొటేషన్ పద్దతి ప్రకారం తొలి మూడు వన్డేలకు జట్టుని ఎంపిక చేశామని, టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించడం కోసం వారికి విశ్రాంతి కల్పించామని పేర్కొన్నారు. జట్టులోకి ఎంపికవ్వడం వారికి పెద్ద విషయం కాదని, దీని రాద్దాంతం చేయడం తగదని రవిశాస్త్రి హితవు పలికారు.

వరల్డ్ కప్‌కు మరో రెండేళ్లు సమయం

వరల్డ్ కప్‌కు మరో రెండేళ్లు సమయం

వరల్డ్ కప్‌కు మరో రెండేళ్లు సమయం ఉందని చెప్పిన రవిశాస్త్రి... శ్రీలంక పర్యటనలో యువ ఆటగాళ్లు అక్షర పటేల్, యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు. దీనికి కొనసాగింపుగా వారిద్దరికి మరోక అవకాశం కల్పించామని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. దీనికి తోడు భారత రిజర్వ్ బెంచ్ సత్తాని కూడా పరీక్షిస్తున్నామని అన్నాడు.

తొలి మూడు వన్డేలకు అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతి

తొలి మూడు వన్డేలకు అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతి

గత ఆదివారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆసీస్‌తో జరిగే తొలి మూడు వన్డేలకు అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతి కల్పిస్తూ భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జట్టు ప్రకటించే సమయంలోనే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా రోటేషన్‌ పద్దతిని ఆటగాళ్లను ఎంపికచేశామని ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు.

కుల్దీప్ యాదవ్‌కు అద్భుత అవకాశం

కుల్దీప్ యాదవ్‌కు అద్భుత అవకాశం

ఇందులో భాగంగానే టీమిండియా ప్రధాన స్పిన్నర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్‌, జడేజాలకు విశ్రాంతి కల్పించామని పేర్కొన్నారు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే తొలి మూడు వన్డేలకు జట్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో కూడా చెలరేగుతాడని సెలక్షన్‌ కమిటీ భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్‌కు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు విశ్రాంతి కల్పించడంపై మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

సెలక్షన్ కమిటీ తీరుపై అజాహరుద్దీన్

సెలక్షన్ కమిటీ తీరుపై అజాహరుద్దీన్

స్పిన్ పిచ్‌లపై ప్రభావం చూపే ఇద్దరు స్పిన్నర్లను విశ్రాంతిని కారణంగా చూపుతూ పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సెలక్షన్ కమిటీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 'శ్రీలంక సిరిస్‌కు అశ్విన్, జడేజాకు విశ్రాంతి ఇచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియా లాంటి జట్టుతో ఆడేటప్పుడు అత్యుత్తమ స్పిన్నర్లను జట్టుకు ఎంపిక చేయాలి' అని అన్నాడు. 'దీనికి తోడు సొంతగడ్డపై పిచ్‌లన్నీ స్పిన్‌కు బాగా సహకరిస్తాయి. అలాంటప్పుడు వారిని తప్పించి ఆసీస్‌కు పుంజుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి. అశ్విన్.. కౌంటీల్లో ఆడటం బాగానే ఉంది. కానీ నేనే కెప్టెన్ అయితే అశ్విన్, జడేజాను కచ్చితంగా జట్టులోకి తీసుకునేవాడిని. సొంతగడ్డపై గాకుండా విదేశాల్లో ఆడినప్పుడు భారత జట్టు సత్తా ఏంటో తెలుస్తుంది' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+