For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో బ్రాడ్మన్ రికార్డుని సంగక్కర సమం చేస్తాడా?

By Nageswara Rao

బెంగుళూరు: టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర ఒకరు. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియాతో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు కుమార సంగక్కర వీడ్కోలు పలకనున్నాడు.

ఈ నేపథ్యంలో 37 ఏళ్ల కుమార సంగక్కర ఆస్టేలియాకు చెందిన లెజెండ్ క్రికెటర్ డాన్ బ్రాడ్మెన్ రికార్డుని సమం చేస్తాడా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు కుమార సంగక్కర ప్రకటించిన తరుణంలో ఆ సమయం రానే వచ్చింది.

శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా, శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. మూడు టెస్టుల్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 12న గల్లెలో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి కుమార సంగక్కర వీడ్కోలు పలకనున్న రెండో టెస్టు ఆగస్టు 20న కొలంబోలోని (పి సారా ఓవల్) మైదానంలో జరగనుంది.

Can Sangakkara equal Bradman's record in India Test series?

టెస్టు క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఆస్టేలియాకు చెందిన డాన్ బ్రాడ్మన్(12) ఉండగా, ఆ తర్వాతి స్ధానంలో కుమార సంగక్కర (11)తో ఉన్నాడు. ఇక కుమార సంగక్కర రెండో టెస్టుల్లో మొత్తంగా 4 సార్లు మాత్రమే క్రీజులో ఆడతాడు.

మరి డాన్ బ్రాడ్మన్ రికార్డుని సమం చేస్తాడో లేదో? ఆస్టేలియాకు చెందిన డాన్ బ్రాడ్మన్ 52 టెస్టుల్లో 12 డబుల్ సెంచరీలు సాధించాడు. 2000లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కుమార సంగక్కర ఇప్పటి వరకు శ్రీలంక తరుపున 132 టెస్టు మ్యాచ్ లాడాడు. 12,305 పరుగులతో ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా గుర్తింపు పొందారు.

టెస్టు క్రికెట్ విషయానికి వస్తే 38 సార్లు మూడంకెల స్కోరు సాధించిన ఆటగాళ్లలో సంగక్కర 4వ స్ధానంలో ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ అనంతరం అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్‌లో 404 మ్యాచ్‌లాడిన సంగక్కర 25 సెంచరీలు సాధించాడు.

టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు (టాప్ 5)

12 - డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా)
11 - కుమార్ సంగక్కర (శ్రీలంక)
9 - బ్రియాన్ లారా (వెస్టిండీస్)
7 - వాలీ హమ్మండ్ (ఇంగ్లాండ్), మహేల జయవర్థనే (శ్రీలంక)
6 - మార్వన్ ఆటపట్టు (శ్రీలంక), వీరేంద్ర సెహ్వాగ్ (ఇండియా), జావెద్ మియాందాద్ (పాకిస్తాన్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), సచిన్ టెండూల్కర్ (ఇండియా)

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు (టాప్ 5)

51 - సచిన్ టెండూల్కర్ (ఇండియా)
45 - జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)
41 - రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
38 - కుమార్ సంగక్కర (శ్రీలంక)
36 - రాహుల్ ద్రవిడ్ (ఇండియా)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+