Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా కోహ్లీకి బదులు రోహితే ఉండాలట!!

Can Rohit Sharma replace Virat Kohli as a captain?

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీతో ఆసియా కప్ ట్రీఫీ విజయవంతంగా ముగిసింది. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రోహిత్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత కెప్టెన్‌ను మార్చాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. తన రోహిత్ కెప్టెన్సీతో ఒక్క మ్యాచ్‌ ఓడకుండా జట్టుకు విజయానందించాడు. క్లిష్ట సమయాల్లో తను తీసుకునే నిర్ణయాలు మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీని గుర్తు చేశాయి.

పూర్తి స్థాయి కెప్టెన్సీకి సిద్ధమా

పూర్తి స్థాయి కెప్టెన్సీకి సిద్ధమా

ఈ విషయాన్ని తానే మీడియా ముఖంగా చెప్పుకున్నాడు. కెప్టెన్సీపై ధోని ప్రభావం ఎక్కువగా ఉందని, అతని లోని లక్షణాలు తనలో కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇక పూర్తి స్థాయి కెప్టెన్సీకి సిద్ధమా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తడబాటు లేకుండా రెడీ అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్లు మాట్లాడాడు. దీంతో రోహిత్‌ శర్మకు లిమిటెడ్‌ ఓవర్‌ క్రికెట్‌ పగ్గాలు ఇవ్వాలని అతని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఐపీఎల్‌లో సారథిగా మూడుసార్లు టైటిల్‌

ఐపీఎల్‌లో సారథిగా మూడుసార్లు టైటిల్‌

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సారథిగా రోహిత్‌ మూడుసార్లు టైటిల్‌ అందించాడని, కోహ్లి మాత్రం ఒక్క టైటిల్‌ కూడా అందించలేకపోయాడని గుర్తు చేస్తున్నారు . రోహిత్‌ యువజట్టుతోనే నిదహాస్‌ ట్రోఫీ, ఆసియాకప్‌ గెలిపించాడని చెబుతున్నారు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్‌ అని, కానీ కెప్టెన్‌ మాత్రం కాదంటున్నారు. అతనికి ఫైనల్‌ ఫీవర్‌ కూడా ఉందని, అతని దూకుడు.. కోపం కెప్టెన్స్‌పై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ సాధించిన విజయాలే

కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ సాధించిన విజయాలే

జట్టు ఎంపికలో, ఫీల్డింగ్‌ మార్పుల్లో కోహ్లి విఫలమవుతున్నాడని, ఏ సమయంలో ఎవరితో బౌలింగ్‌ చేయించే విషయంలో కూడా కోహ్లి ఇబ్బంది పడుతున్నారని రోహిత్‌ ఫ్యాన్స్‌ విశ్లేషిస్తున్నారు. దీన్ని విరాట్‌ ఫ్యాన్స్‌ సైతం కొట్టి పారేస్తున్నారు. కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ సాధించిన విజయాలే అతని కెప్టెన్సీకి నిదర్శనమని కౌంటర్‌ ఇస్తున్నారు.

 బీసీసీఐ ఆలోచనా తీరు మాత్రం వేరుగా

బీసీసీఐ ఆలోచనా తీరు మాత్రం వేరుగా

బీసీసీఐ ఆలోచనా తీరు మాత్రం వేరుగా ఉంది. కెప్టెన్‌కు విశ్రాంతినిచ్చి రోహిత్‌తో ఆసియా కప్ ఆడించింది. ఇప్పుడు రోహిత్‌ లేకుండా కోహ్లీ సారథ్యంలో వెస్టిండీస్‌తో పదిహేను మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో వైరాలు పెంచాలని ఇలా చేస్తుందో.. రెండు జట్లు ఉంటే బాగుంటుందని ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో సగటు అభిమానిని పడేస్తోంది.

Story first published: Tuesday, October 2, 2018, 11:07 [IST]
Other articles published on Oct 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+