రోహిత్ శర్మ టెస్టుల్లో టీమిండియా తదుపరి వీరేంద్ర సెహ్వాగ్ అవుతాడా?

హైదరాబాద్: "వీరు, బెంచ్ మీద కూర్చొని కెరీర్‌లో ఎవరూ ఏం సాధించలేదు. నువ్వు ఓపెనర్‌గా ఎందుకు ఆడకూడదు?" భారత టెస్టు జట్టులో మిడిలార్డర్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు చోటు దక్కని సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్న మాటలివి. సెహ్వాగ్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.
టెస్టుల్లో భారత్ తరుపున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ చరిత్ర సృష్టించాడు. అంతేనా టెస్టుల్లో ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం టీమిండియా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సెహ్వాగ్ విషయంలో ఏదైతో జరిగిందో సరిగ్గా రోహిత్ శర్మ విషయంలో కూడా అచ్చం అలాగే జరుగుతోంది.

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ విఫలం
వెస్టిండిస్ పర్యటనలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ విఫలం కావడంతో ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. చాలా అరుదుగా భారత క్రికెట్‌లో స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చెలాయించని అరుదైన సందర్భం ఇది. అంతకముందు స్టార్ ప్లేయర్లుగా పేరొందిన సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్ ఇప్పుడు కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటారు. అయితే, రోహిత్ శర్మ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 12 ఏళ్లు పూర్తైనా... భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు.

మిడిలార్డర్‌లో ఆడే రోహిత్ శర్మ
అయితే, వన్డేల్లో కూడా కెరీర్ తొలి నాళ్లలో మిడిలార్డర్‌లో ఆడే రోహిత్ శర్మ 2013లో ఓపెనర్‌గా బరిలోకి దిగడం... ఆ తర్వాత వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పడం మనకు తెలిసిందే. అప్పట్లో కెప్టెన్ ధోని తీసుకున్న నిర్ణయం రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌ను పూర్తిగా మార్చి వేసింది. ప్రపంచ క్రికెట్‌లో అతడిని ఒక అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. భారత్ తరుపున 27 టెస్టులు ఆడిన తర్వాత రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఓ సువర్ణావకాశం
టెస్టుల్లో వస్తూ పోతూ ఉన్న రోహిత్ శర్మకు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఓ సువర్ణావకాశం. టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మకు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం మద్దతుగా నిలిచాడు. రోహిత్‌శర్మ ప్రపంచంలో ఎక్కడైనా సహజసిద్ధమైన బ్యాటింగ్ చేస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తమే మారిపోతుందని కోహ్లీ పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ
తొలి టెస్టుకు ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ విషయంలో ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం. భారత్‌లో ఆడేటప్పుడు ఒక ప్రణాళిక, విదేశాల్లో ఆడేటప్పుడు మరో ప్రణాళిక ఉంటుంది. ఓపెనర్‌గా వచ్చే బ్యాట్స్‌మన్‌కు అతడి ఆటపై అవగాహన వచ్చేవరకు సమయమివ్వాలి" అని అన్నాడు.

రోహిత్ శర్మకు సువర్ణావకాశం
"రాలేదు. ప్రస్తుతం ఇది రోహిత్ శర్మకు సువర్ణావకాశం. ఈ మార్పుని జట్టు మేనేజ్ మెంట్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రోహిత్ విషయంలో మాకేమీ తొందరలేదు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో కాస్త భిన్నంగా ఉంటుంది. రోహిత్ బాగా ఆడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడమే అతడి బలం. గతంలో వీరూ భాయ్ ఎన్నో ఏళ్లు టీమిండియాకు ఇదే పని చేశాడు. ఎవరో చెబితే సెహ్వాగ్ దూకుడుగా ఆడి సెంచరీ బాదలేదు. అది అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్" అని కోహ్లీ తెలిపాడు.

ఓపెనర్‌గా దించాలనే చర్చ వచ్చాక
"రోహిత్ శర్మను ఓపెనర్‌గా దించాలనే చర్చ వచ్చాక, ఆ తర్వాత ఎనిమిది నెలల్లో ఓపెనర్‌గా మారాడు. భారత్‌లోని పిచ్‍లు తొలి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో పోలిస్తే షాట్లు ఆడేందుకు అవకాశం ఉంటుంది. రోహిత్ టెస్టు ఓపెనర్‌గా సక్సెస్ అవుతాడా.. లేదా అప్పుడే తెలియదు. కచ్చితంగా రోహిత్ టెస్టు ఓపెనర్‌గా కూడా రాణిస్తాడు. సరైన సమయంలో రోహిత్ గాడిలో పడతాడు. ఈ విషయంలో రోహిత్‌కు సమయం ఇవ్వాలి" అని కోహ్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications