Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీస్ రేసులో పాకిస్తాన్?.. భారత్‌కు షాకిస్తుందా?

Can pakistan still hope to oust india from semifinals

బంగ్లాదేశ్‌పై భారత జట్టు ఉత్కంఠ భరిత విజయం సాధించడంతో దాదాపుగా సెమీస్ బెర్తు భారత్‌కు ఖాయమైంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్న మరో జట్టు సౌతాఫ్రికా. గురువారం నాడు ఈ జట్టుతోనే పాకిస్తాన్ తలపడుతోంది. సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్న దాయాది దేశం..

ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరే జట్లపై క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధిస్తే.. భారత్ సెమీస్ చేరడం గ్యారంటీ.

పాక్ సెమీస్ ఆశలే సజీవమేనా?

పాక్ సెమీస్ ఆశలే సజీవమేనా?

బంగ్లాదేశ్‌పై భారత్ గెలవడంతో పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. దీంతో ఆ జట్టు అభిమానులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ సెమీస్ చేరడం అసాధ్యమా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గణాంకాల పరంగా చూసుకుంటే పాకిస్తాన్‌కు ఇంకా సెమీస్ చేరే ఛాన్స్ కనబడుతోంది. అయితే ఈ అవకాశాలు నిలబడాలంటే ఈరోజు సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తోపాటు చివరగా బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచి మంచి నెట్ రన్ రేట్ సంపాదించాలి. ఆ తర్వాత మిగతా జట్లు అంటే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌ల ఫలితాలపై ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

జింబాబ్వేనే కీ ఫ్యాక్టర్

జింబాబ్వేనే కీ ఫ్యాక్టర్

ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ అవకాశాలు భారీగా దెబ్బ తినడానికి కారణం జింబాబ్వే. భారత్ చేతిలో చివరి బంతికి ఓడిన పాకిస్తాన్.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో కూడా ఓటమి పాలైంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అత్యంత షాకింగ్ విజయం ఇదే అనడం అతిశయోక్తి కాదు. ఈ ఓటమితో బాబర్ ఆజమ్ సేనపై ఆ జట్టు అభిమానులతోపాటు మాజీలు కూడా నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఆ జట్టు సెమీస్ చేరాలంటే మళ్లీ జింబాబ్వేనే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గనుక మరో సంచలనం నమోదై, భారత్ ఓడితే.. నెట్ రన్ రేట్ దృష్ట్యా పాకిస్తాన్‌ ఈ గ్రూప్‌లో భారత్‌ కంటే మెరుగైన స్థితిలో నిలుస్తుంది. తద్వారా సెమీస్ చేరుతుంది.

మరో సెనారియో

మరో సెనారియో

లేదంటే గురువారం నాడు ప్రొటీస్‌పై పాకిస్తాన్ నెగ్గడంతోపాటు ఆ జట్టును నెదర్లాండ్స్ ఓడించాలి. నెదర్లాండ్స్ చేతిలో గనుక సఫారీలు ఓడితే.. పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. అందుకే బంగ్లాపై పాక్ భారీ విజయం నమోదు చేయాలి. నెదర్లాండ్స్ గెలిస్తే సౌతాఫ్రికా, పాకిస్తాన్ సమానమైన పాయింట్లతో నిలుస్తాయి. ఇలాంటి సమయంలో బంగ్లాపై భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ మెరుగు పరుచుకుంటే పాక్.. సెమీస్ చేరుతుంది. అప్పుడు భారత్, పాక్ ఈ గ్రూప్ నుంచి సెమీస్ వెళ్తాయి. ప్రస్తుతం ఉన్న జట్ల బలాబలాలు పరిశీలిస్తే సఫారీలను నెదర్లాండ్స్ ఓడించడం అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ లెక్క ప్రకారం పాక్‌ను సెమీస్ ఆశలు పూర్తిగా ఆవిరి కాలేదనే చెప్పాలి.

Story first published: Thursday, November 3, 2022, 10:17 [IST]
Other articles published on Nov 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+