Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఇలా జరిగితే ఈ సారి కప్పు సన్‌రైజర్స్‌దే!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో కావ్యమారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు విజయవంతంగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన ఎస్ఆర్‌హెచ్.. మే 27న చండీగఢ్ వేదికగా జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ జట్టు 2016 నాటి సరికొత్త చరిత్రను మళ్లీ రిపీట్ చేస్తుందా? అనే ఆసక్తికర చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి కూడా ట్రోఫీని గెలిచిన ఏకైక జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రత్యేక రికార్డు ఉంది.

2016 హిస్టరీని రిపీట్ చేయాలంటే..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలంటే ప్లేఆఫ్స్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. మొదట మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలవాలి. అందులో విజయం సాధిస్తే.. మే 29న అదే వేదికపై క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఫైనల్‌కు చేరుకోవడానికి క్వాలిఫైయర్-2 పోరులోనూ విజయం తప్పనిసరి. 2016లో అప్పటి కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇదే మ్యాజిక్‌ను చేసింది. అప్పట్లో ప్లేఆఫ్స్‌లో మొదట కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్లను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఆపై ఫైనల్ పోరులో ఆర్సీబీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అడ్డుకుని మొదటిసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2011లో సీఎస్కే కూడా ఎలిమినేటర్ ఆడి ఫైనల్‌కు చేరినప్పటికీ, టైటిల్ గెలవలేకపోయింది.

Can Kavya Maran Sunrisers Hyderabad Repeat 2016 History to Win the Trophy from the Eliminator Details

భీకర ఫామ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద బలం వారి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్ 14 మ్యాచ్‌ల్లో 606 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 569 పరుగులు, యువ సంచలనం అభిషేక్ శర్మ 563 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

బౌలింగ్‌లోనూ బెస్టే!
కేవలం బ్యాటింగే కాకుండా బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. యువ బౌలర్లు ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇషాన్ మలింగ 14 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టగా.. సాకిబ్ హుస్సేన్ కేవలం 10 మ్యాచ్‌లలోనే 15 వికెట్లు తీసి మెరిశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ప్యాట్ కమిన్స్ సేన.. ఈసారి కూడా ఎలిమినేటర్ ద్వారా వచ్చి ట్రోఫీని గెలిస్తే, ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.

Story first published: Sunday, May 24, 2026, 11:28 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+