కోహ్లీ నవ్వాడు, స్లిప్‌లో సూపర్ మ్యాన్‌లా రోహిత్ మూడు క్యాచ్‌లు (వీడియో)


హైదరాబాద్: ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అటు బ్యాటింగ్‌తోనే కాదు, ఇటు ఫీల్డింగ్‌లో సైతం మెరుపులు మెరిపించాడు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన 4వ వన్డేలో రోహిత్, రాయుడు సెంచరీల పుణ్యమా అని వెస్టిండిస్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్లలో శిఖర్ ధావన్(38) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరినప్పటికీ, మరో ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు వన్డేలు ముగియగా.. రెండు సార్లు ఏకంగా 150+ స్కోరు సాధించిన రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

వన్డేల్లో 21వ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ
సిరీస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (162) పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత కొద్ది సేపటికే అంబటి రాయుడు కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నట్టు కనిపించాడు.

వన్డేల్లో 3వ సెంచరీని నమోదు చేసిన రాయుడు
అయితే, రోహిత్ 162 పరుగుల వద్ద నర్స్ బౌలింగ్‌లో హేమ్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత అంబటి రాయుడు కూడా సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కాగా, 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో కెరీర్‌లో మూడో సెంచరీ సాధించిన అంబటి రాయుడు ఆ తర్వాత రనౌటై పెవిలియన్ చేరాడు.

50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు
దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్‌లు తమ అద్భుత బౌలింగ్‌తో కరీబియన్ జట్టును కకావికలం చేశారు. ఫలితం నాలుగో వన్డేలో భారత్‌కు 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
నాలుగో వన్డేలో మూడు క్యాచ్‌ల్ని అందుకున్న రోహిత్ శర్మ
ఈ మ్యాచ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ మూడు క్యాచ్‌ల్ని అందుకున్నాడు. ఇందులో రెండు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. మ్యాచ్ అనంతరం ఈ రెండు క్యాచ్‌లపై రోహిత్ శర్మ మాట్లాడుతూ "కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. అతని చేతి కదలికని చదవడం అంత సులువు కాదు" అని అన్నాడు.
ఏ బంతి విసరబోతున్నాడో ఊహించేందుకు అవకాశం?
"అయితే, నెట్స్‌లో అతని బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తే? ఏ బంతి విసరబోతున్నాడో ఊహించేందుకు అవకాశం ఉంటుంది. అతను గూగ్లీ విసరబోతున్నప్పుడు.. ముందుగానే ఊహించి స్లిప్‌లో క్యాచ్ కోసం సిద్ధమవుతా. అలానే ప్రాక్టీస్ సెషన్‌లోనూ కాసేపు స్లిప్‌లో క్యాచ్‌లు పట్టడంపై ప్రాక్టీస్ చేస్తున్నా" అని రోహిత్ శర్మ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications