For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: అద్భుతం చూస్తామా?.. రసవత్తరంగా మారుతున్న బంగ్లా టెస్టు

 Can Bangladesh win the first test after Middle order collapse

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారుతోంది. ఓవర్ నైట్ స్కోరు 42/0తో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. అయితే టీమిండియా వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ ఈ జోడీని విడగొట్టాడు. అతని బౌలింగ్‌లో షాంటో ఇచ్చిన క్యాచ్.. కోహ్లీ చేతికి తగిలి గాల్లోకి లేచింది. అయితే అది నేలను తాకకముందే పంత్ క్విక్ రెస్పాన్స్‌తో పట్టేయడంతో షాంటో పెవిలియన్ చేరాడు.

 కుప్పకూలిన మిడిలార్డర్..

కుప్పకూలిన మిడిలార్డర్..

షాంటో అవుటైన తర్వాత భారత బౌలర్లు కొంత ఆత్మవిశ్వాసం పొందారు. నెమ్మదిగా మళ్లీ గాడిలో పడ్డారు. యాసిర్ అలీ (5)ని అక్షర్ పటేల్ పెవలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రిస్కీ షాట్‌కు ప్రయత్నించిన లిటాన్ దాస్ (19) లాంగాఫ్‌లో ఉమేష్ యాదవ్‌కు చిక్కాడు. ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసిన బంగ్లా యంగ్ ఓపెనర్ జాకిర్ హసన్ (100) శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీ తర్వాత కొత్త బంతితో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో ముష్ఫికర్ రహీం (23), నురుల్ హసన్ (3) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు.

ఆదుకున్న షకీబల్ హసన్

ఆదుకున్న షకీబల్ హసన్

వరుసగా వికెట్లు పడుతుండటంతో నాలుగో రోజునే బంగ్లాదేశ్ ఆలౌట్ అయిపోతుందని అనిపించింది. అయితే మిడిలార్డర్‌ ఒక పక్క కుప్పకూలుతున్నా కెప్టెన్ షకీబల్ హసన్ (40 నాటౌట్) పట్టుదల ప్రదర్శించాడు. గాయంతో ఆడుతున్న అతను భారత బౌలర్లకు మరో వికెట్ ఇవ్వలేదు. అతనికి మెహదీ హసన్ (9 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. దీంతో చివరి 14 ఓవర్లలో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయారు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా జట్టు 172/6 స్కోరుతో నిలిచింది.

అద్భుతం చూస్తామా?

అద్భుతం చూస్తామా?

మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా ముందు 471 పరుగుల లక్ష్యం ఉంది. నాలుగో రోజు ఓపెనర్లు అద్భుతంగా రాణించడంతో బంగ్లా లక్ష్యం దిశగా సాగింది. మిడిలార్డర్ నుంచి వారికి సహకారం అంది ఉంటే భారత్ ఈ మ్యాచ్‌లో ప్రమాదంలో పడేదే. అయితే మిడిలార్డర్ వైఫల్యానికి షకీబల్ హసన్, మెహదీ హసన్ అడ్డుకట్ట వేశారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా రోజంతా బ్యాటింగ్ చేసినా.. లేదంటే దూకుడుగా ఆడినా బంగ్లా ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ కూడా ఆ సత్తా ఉన్న బ్యాటర్లే కానీ.. ఇంకా బంగ్లా విజయానికి మరో 241 పరుగులు అవసరం ఉన్నాయి. అంటే వీళ్లిద్దరూ చెరో సెంచరీ చేస్తేగానీ బంగ్లా విజయం సాధ్యం కాదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసుకోగా.. ఉమేష్ యాదవ్, అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Story first published: Saturday, December 17, 2022, 16:56 [IST]
Other articles published on Dec 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+