ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ పిచ్‌పై గెలుపుకు ఎంత టార్గెట్ అవసరం అనే ప్రశ్నకు కొన్ని గణాంకాల ఆధారంగా సమాధానాలను తెలుసుకుందాం. ఈ పిచ్‌పై 185 పరుగుల లక్ష్యం అత్యంత కష్టమైందిగా చరిత్ర చెబుతోంది. అంతకు మించి పరుగులు చేస్తే దాన్ని ఛేదించడం పాకిస్థాన్ జట్టుకు చాలా కష్టమే.
దుబాయ్ పిచ్, రికార్డులు ఏం చెబుతున్నాయి?
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్‌పై ఇప్పటివరకు జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల చరిత్రను పరిశీలిస్తే 185 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యానని ఏ జట్టూ ఛేదించలేకపోయింది. ఈ గణాంకం ఈ పిచ్‌పై స్కోర్ ఛేజింగ్ ఎంత కష్టమో సూచిస్తుంది.

దుబాయ్ స్టేడియంలో అత్యధిక రన్ ఛేజ్‌లు:
*184 పరుగులు: శ్రీలంక vs బంగ్లాదేశ్ (2022) - శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం.
*182 పరుగులు: పాకిస్తాన్ vs భారత్ (2022) - పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం.
*183 పరుగులు: ఆఫ్ఘనిస్తాన్ vs యూఏఈ (2016) - ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం.
*177 పరుగులు: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ (2021) - ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం.
*174 పరుగులు: శ్రీలంక vs భారత్ (2022) - శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం.
ఈ గణాంకాలు చూస్తే, ఈ పిచ్‌పై 185-190 పరుగుల స్కోరు సాధిస్తే అది దాదాపుగా విజయానికి హామీ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇంతవరకు 184 పరుగుల లక్ష్యం మాత్రమే ఛేజ్ అయింది. ఒకవేళ భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 190 పరుగుల స్కోర్ సాధిస్తే, పాకిస్తాన్ ఆ లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమవుతుంది.
టాస్ గెలిచిన జట్టు ఏం చేస్తుంది?
దుబాయ్ పిచ్ సగటు స్కోరు 15 పరుగులు. అయితే రాత్రి పూట మంచు ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంతో చాలా మంది కెప్టెన్లు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. కానీ దుబాయ్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 95 టీ20 మ్యాచ్‌లలో 46 మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందగా.. 48 మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది.
భారత బౌలర్ల బలం
భారత జట్టుకు ప్రధాన బలం వారి బౌలింగ్ విభాగం. స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై భారత్ వద్ద కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరు పాకిస్థాన్ బ్యాటర్లకు సవాలు విసరగలరు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేసర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఈ బౌలింగ్ విభాగం కారణంగా పాకిస్థాన్ బ్యాటర్లు 185 పరుగుల టార్గెట్ చేయడం మరింత కష్టమవుతుంది. ఈ కీలక మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-4 దశకు చేరుకుంటుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి.