Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs WI: జట్టులో కరోనా వచ్చిన ఆటగాడు.. వింతగా సెలబ్రేషన్స్ (Video)

ఆస్ట్రేలియా జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో కరోనా సోకిన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు అవకాశం ఇస్తూ తుదిజట్టులో ఎంపిక చేసింది. టాస్ అనంతరం గీతాలాపన సమయంలో గ్రీన్ కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జట్టుకు దూరంగా ఉండటం గమనార్హం. గ్రీన్‌తో పాటు కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు కొవిడ్ పాజిటివ్‌‌గా బుధవారమే నిర్ధారణ అయ్యింది. కానీ అతడికి ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని ఆసీస్ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ పింక్ బాల్ టెస్టులో వెస్టిండీస్ గొప్పగా పోరాడుతోంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 64 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ (4) ఆదిలోనే ఔటయ్యాడు. చంద్రపాల్ (21), మెకంజీ (21) ఫర్వాలేదనిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అథంజె (8), జస్టిన్ (6) నిరాశపరించారు.

Cameron Green who got corona in the Australian team against West Indies test

అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జాషువా డిసిల్వా (79)తో కలిసి హోడ్జ్ (70*) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. వీరిద్దరు ఆరో వికెట్ 149 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 80 ఓవర్లు వెస్టిండీస్ స్కోరు 218/6. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు, హేజిల్‌వుడ్, కమిన్స్, లయన్ తలో వికెట్ తీశారు.

కాగా, హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే వికెట్ సెలబ్రేషన్స్ చేసుకునే టైమ్‌లో గ్రీన్ కూడా జట్టు వద్దకు వచ్చాడు. కానీ కరోనా వచ్చిందని గుర్తు రావడంతో కాస్త దూరంగా ఉంటూ హేజిల్‌వుడ్‌‌తో సింబాలిక్‌గా సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు గ్రీన్ బౌలింగ్, ఫీల్డింగ్ జట్టుతో కలిసే చేస్తున్నాడు. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులే ఇచ్చాడు. అతడు ఉపయోగించిన బాల్‌నే ఫీల్డర్లు తాకుతున్నారు. తనకి గుర్తు వచ్చినప్పుడే గ్రీన్ కరోనా నిబంధనలు పాటిస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Thursday, January 25, 2024, 16:40 [IST]
Other articles published on Jan 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+