Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది మిస్సయితే నన్ను చంపేసేవారు!

ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ సాధించిన భారీ విజయంలో ఫిన్ అలెన్ సెంచరీ హైలైట్‌గా నిలిచింది. అయితే ఫిన్ అలెన్ తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేయడంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ పోషించిన పాత్ర ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి ఫిన్ అలెన్ విధ్వంసాన్ని ఆస్వాదించిన గ్రీన్.. మ్యాచ్ అనంతరం చేసిన కామెంట్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

ఫిన్ అలెన్ సెంచరీ వెనుక గ్రీన్ 'క్యాలిక్యులేషన్'!
కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఫిన్ అలెన్.. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్రీన్ (27 బంతుల్లో 33 పరుగులు) రెండో వైపు నెమ్మదిగా ఆడుతూ అలెన్‌కు ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 116 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకానొక దశలో జట్టు విజయానికి 29 పరుగులు కావాల్సి ఉండగా.. ఫిన్ అలెన్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఆ సమయంలో తాను గనుక మ్యాచ్ ముగించే ప్రయత్నం చేసి ఉంటే, అలెన్ సెంచరీ మిస్ అయ్యేదని గ్రీన్ పేర్కొన్నాడు.

Cameron Green on Helping Finn Allen Score Maiden IPL 2026 Century Says Most Hated Man in Kolkata

కేకేఆర్ ఆల్‌రౌండర్ ఫన్నీ రియాక్షన్
"కోల్‌కతాలో అత్యంత ద్వేషించబడే వ్యక్తిగా మారకూడదనే నేను జాగ్రత్తపడ్డాను" అని కామెరాన్ గ్రీన్ సరదాగా వ్యాఖ్యానించాడు. జట్టు గెలవడానికి ఇంకా 29 పరుగులు కావాల్సి ఉన్నప్పుడే తాను లెక్కలు వేసుకున్నానని.. ఒకవేళ తాను అనవసరంగా పరుగులు తీసి ఫిన్ అలెన్ సెంచరీకి అడ్డుపడి ఉంటే కోల్‌కతా అభిమానులు తనను ఎప్పటికీ క్షమించరని గ్రీన్ జోక్ చేశాడు. అలెన్ కూడా లెక్కల్లో దిట్టని.. అందుకే ఇద్దరం సమన్వయంతో ఆడి అతని మైలురాయిని చేరుకునేలా చేశామని చెప్పాడు.

ఈ సీజన్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్లు పెట్టి గ్రీన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 10 మ్యాచ్‌ల్లో 232 పరుగులు చేసి సాధారణ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. జట్టు విజయాల్లో భాగస్వామి కావడం సంతృప్తినిస్తుందని గ్రీన్ వెల్లడించాడు. ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మే 13న రాయ్‌పూర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కోల్‌కతా తదుపరి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Saturday, May 9, 2026, 13:14 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+