
ఆ విషయం బౌలర్లకు తెలుసు:
తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ మాటాడుతూ.. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి కొన్ని తెలియని విషయాలను పంచుకున్నాడు. సంఘటన జరగకముందే తన సహచర బౌలర్లకు టాంపరింగ్ ఉదంతం గురించి తెలుసని ఆ అంతర్జాతీయ పత్రిక అడిగిన ప్రశ్నకు బాన్‌క్రాఫ్ట్ సమాధానమిచ్చాడు. 'బాల్ టాంపరింగ్ గురించి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఇతర బౌలర్లకు కచ్చితంగా తెలుసు. ఎందుకంటే.. నేను చేసిన పని బౌలర్లకు ఎంతో ఉపయోధపడుతుంది. దాని గురించి వాళ్లకంతా ఓ అవగాహన ఉంది. దాని గురించి వివరంగా చెప్పాల్సిన పనిలేదు' అని బాన్‌క్రాఫ్ట్ అన్నాడు.

తప్పని తెలుసుకోలేకపోయా:
'బాల్ టాంపరింగ్ విషయంలో నేను చాలా లోతుల్లోకి వెళ్లాను. నా విలువలను కూడా మర్చిపోయాను. మా జట్టులో అందరిచేతా ప్రశంసలు పొందాలనే ఉద్దేశం నన్ను బలంగా ఎగదోసింది. జట్టులో నేనొక ముఖ్యమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం నాలో కలిగింది. ఉప్పుకాగితాన్ని బంతికి పూసి జట్టుకు ఉపయోగంగా మారాలని అనుకున్నా. అది జరిగాక కానీ నేను చేసింది తప్పని తెలుసుకోలేకపోయా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో అది కూడా ఒక భాగమని చెప్పొచ్చు. అది నేను నేర్చుకోవాల్సిన కఠినమైన పాఠం. అది తప్పని తెలిస్తే.. ముందే వేరే నిర్ణయం తీసుకునేవాడిని' అని కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ అన్నాడు.

అనేక విమర్శలు:
బాల్ టాంపరింగ్ కారణంగా కామెరూన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఆసీస్ బోర్డు, మాజీలు, కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇక ఫాన్స్ ఆగ్రహానికి అడ్డేలేకుండా పోయింది. నిషేధం కారణంగా వార్నర్, స్మిత్ ఐపీఎల్ 2018 కూడా ఆడలేదు. ఆపై 2019 సీజన్ ఆడి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశారు. ఈ సమయంలో మైదానంలోని ఫాన్స్ వారిని హేళన చేశారు. ఆపై అంతా సర్దుకుంది. స్మిత్ మళ్లీ కెప్టెన్ రేసులోకి వచ్చాడు.


Click it and Unblock the Notifications
