For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాడు బాల్ టాంపరింగ్‌లో కీలకం... నేడు యాషెస్ జట్టులో చోటు

Cameron Bancroft Named In Australia's 17 Man Ashes Squad || Oneindia Telugu
 Cameron Bancroft named in Australias 17-man Ashes squad

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరగనున్న యాషెస్ సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో ఆస్ట్రేలియా జట్టులో కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ చోటు దక్కించుకున్నాడు. గతేడాది సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ముగ్గురు ఆటగాళ్లలో కామెరూన్ బాన్‌క్రాప్ట్ ఒకడన్న సంగతి తెలిసిందే.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

బాల్ టాంపరింగ్‌‌కు పాల్పడిన కారణంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై ఏడాదిపాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ను మాత్రం 9 నెలల పాటు నిషేధం విధించింది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన ఏడాదిపాటు నిషేధం ముగియడంతో వార్నర్, స్మిత్‌లను ప్రపంచకప్‌ జట్టులో సెలక్టర్లు ఎంపిక చేశారు.

తాజాగా యాషెస్ టెస్టు సిరిస్ కోసం ఎంపిక చేసిన 17 మంది జట్టులో కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టుకు టిమ్ పైనీ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో పేసర్ మైకేల్ నెసర్ ఒక్కడే ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు.

జట్టు ఎంపికపై ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రేవర్ హార్న్ మాట్లాడుతూ "25 మంది ఆటగాళ్ల జాబితాను 17 మందికి కుదించడం చాలా కష్టంతో కూడుకున్నది. యాషెస్ సిరిస్‌కు చోటు దక్కించుకుని ఆటగాళ్లంతా అన్ లక్కీ ప్లేయర్లు. ఈ సిరిస్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం" అని అన్నాడు.

"యాషెస్ సిరిస్‌కు పూర్తిగా సన్నద్ధమయ్యాం. ఈ జట్టులో ఎంపికైన ఎనిమిది ఆటగాళ్లు ఆస్ట్రేలియా-ఏ జట్టుకు చెందిన వారు. వీరంతా గత నెల రోజులుగా యుకే పర్యటనలో ఉన్నారు. మరో ఆరుగురిని మాత్రం ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ జట్టు నుంచి ఎంపిక చేశాం. ఆటగాళ్లంతా తొలి టెస్టుకు అందరూ సంసిద్ధంగా ఉన్నారు" అని ట్రేవర్ హార్న్ తెలిపాడు.

యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 1న ఎడ్జిబాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది.

Story first published: Friday, July 26, 2019, 17:51 [IST]
Other articles published on Jul 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+