'బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలతో డేవిడ్ వార్నర్ సమాధి అయ్యాడు'

హైదరాబాద్: మాజీ వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ సమాధి చేశాడని ఆసీస్ మాజీ ఓపెనర్ మైకేల్ స్లాటర్ అన్నాడు. బుధవారం మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అదే రోజున బాల్ ట్యాంపరింగ్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్‌కు బాన్‌క్రాఫ్ట్, స్టీవ్‌స్మిత్‌లు ఇంటర్యూ ఇచ్చారు.

డేవిడ్ వార్నరే కారణం
అందులో తాను తప్పు చేయడానికి డేవిడ్ వార్నరే కారణమని తాజాగా బాన్‌క్రాఫ్ట్ వెల్లడించాడు. "వార్నర్ ప్రోత్సాహంతోనే నేను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాను. మ్యాచ్‌పై మేం పట్టు సాధిస్తున్న దశలో వార్నర్ నా చేతికి బంతి ఇచ్చి బాల్ ట్యాంపరింగ్ చేయాలని చెప్పాడు. జట్టులో నా విలువ పెరుగుతుందని, ఆ పనికి నేను సరిపోతాని భావించాను. అందుకే అంగీకరించాను. అంతకు మించి నాకేమీ తెలియదు. అదెంత పొరపాటో నాకు ఇప్పుడు తెలిసింది" అని చెప్పుకొచ్చాడు.

గౌరవం పొందడానికి వ్యూహం రచిస్తున్నారు
బాన్‌క్రాప్ట్ వ్యాఖ్యల వల్ల వారిద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆసీస్ మాజీ ఓపెనర్ మైకేల్ స్లాటర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మైకేల్ స్లాటర్ మాట్లాడుతూ "స్టీవ్‌స్మిత్, బాన్‌క్రాఫ్ట్ ఇంటర్యూ వెనక ఏదో వ్యూహం ఉంది. వార్నర్‌పై నిందలు వేస్తూ ప్రజలు, ఇతర ఆటగాళ్ల నుంచి గౌరవం పొందడానికి వారు వ్యూహం రచిస్తున్నారు" అని అన్నాడు.

డేవిడ్ వార్నర్ సమాధి అయ్యాడు
"కానీ వారి వ్యాఖ్యల్లో డేవిడ్ వార్నర్ సమాధి అయ్యాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం జరిగినప్పుడే నిజానిజాలేంటో చెప్పొచ్చు కదా. ఇప్పుడు వెనక్కి వెళ్లి భిన్నంగా చెప్పడం వల్ల ఉపయోగం లేదు. వారందరూ కలిసే ట్యాంపరింగ్ చేశామని అప్పట్లో ఒప్పుకొన్నారు కదా" అని మైకేల్ స్లాటర్ పేర్కొన్నాడు. మరోవైపు గిల్‌క్రిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బాన్‌క్రాఫ్ట్, స్టీవ్‌స్మిత్ తమకేం పాపం తెలియదన్నట్టు మాట్లాడిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications