Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూపర్ మ్యాన్ అనొచ్చా!: స్లిప్‌లో వేడ్ సూపర్ క్యాచ్ చూశారా?(వీడియో)

Matthew Wade's Super Catch In Slips | Oneindia Telugu
Call him Superman: Matthew Wades freakish catch in slips

హైదరాబాద్: మైదానంలోని ఫీల్డర్లు సూపర్ మ్యాన్‌లా ఎగిరి క్యాచ్‌లు పట్టడాన్ని చూస్తుంటాం. ముఖ్యంగా బౌండరీ దగ్గర ఫీల్డర్లు కలిసి కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడం టీ20ల్లో తరుచుగా కనిపిస్తాయి. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో అలాంటి క్యాచ్‌నే స్లిప్‌లో మాథ్యూ వేడ్ అందుకున్నాడు.

టోర్నీలో భాగంగా న్యూసౌత్ వేల్స్, టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ పట్టిన క్యాచ్ క్రికెట్‌లోని అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ క్యాచ్ టీమ్ వర్క్‌తో కూడిన క్యాచ్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇలాంటి క్యాచ్‌లను ఇప్పటివరకు మనం బౌండరీల దగ్గర చూశాం. కానీ తొలిసారి స్లిప్స్‌లో దాదాపు నేలపాలైందనుకున్న క్యాచ్‌ను మాథ్యూ వేడ్ అందుకోవడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ బ్యాట్స్‌మన్ డేనియల్ హ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న అలెక్స్ డూలాన్ వదిలేశాడు.

దీంతో ఆ బంతి నేలను తాకుతుందనకున్న సమయంలో క్షణాల్లో తన ఎడమవైపు డైవ్ చేసిన మాథ్యూ వేడ్ దానిని అత్యంత చాకచక్యంగా అందుకున్నాడు. ఈ కళ్లు చెదిరే క్యాచ్‌‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Story first published: Wednesday, March 20, 2019, 15:28 [IST]
Other articles published on Mar 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+