న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతాలో అభిమానుల సందడి.. సౌరవ్‌ గంగూలీకి ఘన స్వాగతం!!

Sourav Ganguly : Fans Welcome Sourav Ganguly In Kolkata After His Selection As BCCI President
CAB Members and Kolkata Fans rolls out the red carpet for Sourav Ganguly

కోల్‌కతా: భారత జట్టు మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం(క్యాబ్‌) ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ ఈనెల 23న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టబోతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసి కోల్‌కతాకు చేరుకున్న సౌరవ్‌ గంగూలీకి ఘన స్వాగతం లభించింది. అభిమానులు బెంగాల్‌ టైగర్‌కు రెడ్ కార్పెట్ పరిచారు. అభిమానుల సందడితో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

<strong>ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియా సొంతం.. డెడ్‌ వికెట్లపై కూడా రాణిస్తున్నారు!!</strong>ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియా సొంతం.. డెడ్‌ వికెట్లపై కూడా రాణిస్తున్నారు!!

కోల్‌కతాలో ఘన స్వాగతం

కోల్‌కతాలో ఘన స్వాగతం

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్‌ పదవి కోసం దాదా నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రెసిడెంట్‌ పదవి కోసం దాదా ఒక్కడే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత దాదా పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దాదా.. నేరుగా ఈడెన్‌ గార్డెన్స్‌కు చేరుకున్నారు. అక్కడ దాదాకు క్యాబ్‌ అధికారులు, మీడియా ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎంట్రీలో దాదా కటౌట్‌లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సందడిగా మారిన ఈడెన్‌:

సందడిగా మారిన ఈడెన్‌:

ఈడెన్‌ గార్డెన్స్‌ మొత్తం దీపావళి పండుగ తరహాలో కళ్లుచెదిరే తరహాలో క్యాబ్‌ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈడెన్‌ మైదానం పూలు, విద్యుదీపాలతో అలంకరించారు. అందరూ కలిసి గంగూలీతో కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేసుకున్నారు. దీంతో ఈడెన్‌ సందడిగా మారింది. 'బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టబోతున్న గంగూలీ సర్‌కి అభినందనలు' అని కేక్‌పై రాసారు.

23న బాధ్యతలు:

23న బాధ్యతలు:

గంగూలీ ఈనెల 23న బీసీసీఐ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను చేపట్టబోతున్నారు. దాదా పది నెలల పాటు (సెప్టెంబర్ 2020) పదవిలో ఉండబోతున్నారు. ప్రస్తుతం క్యాబ్ అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాక క్యాబ్ పదవిని దాదా వదిలేయనున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చేపట్టబోతున్న గంగూలీని పలువురు ప్రముఖులు అభినందించారు.

2008లో రిటైర్మెంట్:

2008లో రిటైర్మెంట్:

గంగూలీ కెరీర్‌లో 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన గంగూలీ కెరీర్‌.. 1996లో టెస్ట్‌ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్‌లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్‌ చీఫ్‌గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.

Story first published: Wednesday, October 16, 2019, 14:14 [IST]
Other articles published on Oct 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X