న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ టాంపరింగ్: స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేసే ఆలోచనలో సీఏ?

Ball Tampering Issue : స్మిత్, వార్నర్‌పై నిషేధం ఎత్తివేత..!
CA to consider lifting ban on Steve Smith, David Warner

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో వరుస ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు గాను ఆ దేశ్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌, బాన్‌క్రాప్ట్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది.

ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) ఈ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధాన్ని ఎత్తేయాలని గత కొన్నాళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను డిమాండ్‌ చేస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 38.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టకుంది.

పునరాలోచనలో పడ్డ క్రికెట్ ఆస్ట్రేలియా

పునరాలోచనలో పడ్డ క్రికెట్ ఆస్ట్రేలియా

తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఆసీస్ ఓటమి పాలుకావడం... ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌ చేసిన విన్నపం.... సీఏను పునరాలోచనలో పడేసింది. ఆటగాళ్ల అసోసియేషన్‌ డిమాండ్‌ను సీఏ పరిగణలోకి తీసుకుంటుందని, గవర్నింగ్‌ బాడీ సీఈవో కెవిన్‌ రోబర్ట్స్‌ బుధవారం మీడియాకు తెలిపారు.

 ఒత్తిడిలోకి కూరుకుపోయిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఒత్తిడిలోకి కూరుకుపోయిన క్రికెట్ ఆస్ట్రేలియా

నిషేధం ఎత్తేయాలని గత కొన్నిరోజులుగా ఆసీస్‌ ఆటగాళ్ల చేస్తున్న డిమాండ్‌తో సీఏ ఒత్తిడిలోకి కూరుకుపోయిందని, వారి విన్నపంపై బోర్డు సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక వరల్డ్ కప్‌కు కొద్ది రోజుల సమయం ఉండటం.. టీమిండియాతో వచ్చేనెలలో సిరీస్‌ ఆరంభంకావడంతో సీఏ మరోసారి పునరాలోచనలో పడింది.

ఈ ముగ్గరు ఆటగాళ్ల పట్ల సీఏ కఠినంగా వ్యవహరించింది

ఈ ముగ్గరు ఆటగాళ్ల పట్ల సీఏ కఠినంగా వ్యవహరించింది

ఈ ముగ్గరు ఆటగాళ్ల పట్ల సీఏ కఠినంగా వ్యవహరించిందని, శిక్షలు మరి కఠినంగా ఉన్నాయని క్రికెట్‌ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.

స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా

స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా

దీంతో స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధాన్ని విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరుగాంచిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు జట్టులో లేకపోవడంతో ఆ జట్టు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు క్రికెట్‌లో అగ్రజట్టు ఎదిగిన ఆసీస్‌ ప్రస్తుతం వరుస ఓటములతో సిరీస్‌లను కోల్పోతుంది.

Story first published: Thursday, November 8, 2018, 9:03 [IST]
Other articles published on Nov 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X