Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిషేధం ఎత్తివేత: బ్లాక్ బ్యాట్‌ వాడేందుకు రస్సెల్‌కు అనుమతి

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో వెస్టిండిస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ బ్లాక్ కలర్ బ్యాట్‌ని వాడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే బీబీఎల్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో థండర్స్‌ ప్లేయర్‌ రస్సెల్‌ ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాట్‌తో ఏడో స్ధానంలో బరిలోకి దిగాడు.

మ్యాచ్ అనంతరం బ్లాక్ బ్యాట్ వాడకం వల్ల బంతి కలర్ దెబ్బతింటుందని మ్యాచ్ అధికారులు నివేదిక అందజేశారు. బ్యాట్‌పై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని రస్సెల్‌ బ్యాట్‌పై నిషేధం విధించింది. బ్యాట్‌కు ఉన్న నలుపు రంగు బంతికి అంటుకుంటుందని బీబీఎల్‌లో బ్లాక్ బ్యాట్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.

ఆటగాళ్ల డ్రెస్ కోడ్‌ను బట్టి బ్యాట్ కలర్ కూడా ఉండవచ్చని తొలుత పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా దానిపై తన నిర్ణయాన్ని మార్చుకుంటూ నిషేధం విధించింది. ఇక నుంచి బిగ్ బాష్ లీగ్‌లో బ్లాక్ బ్యాట్ వాడరాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలను విధించింది.

 CA allows Andre Russell to use black coloured bat again


'మేము బ్లాక్ బ్యాట్‌పై నిషేధం విధిస్తున్నాం. బ్లాక్ బ్యాట్ వాడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని తొలుత చెప్పినా, బంతిపై నల్లని మరకలు పడుతూ ఉండటంతో ముందస్తు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. అది బీబీఎల్ కావొచ్చు.. డబ్యూబీబీఎల్ కావొచ్చు అంటూ బ్లాక్ బ్యాట్‌పై నిషేధం విధిస్తున్నాం' అని పేర్కొంది.

ఈ నిర్ణయంపై మంగళవారం బిగ్ బాష్ టీ20 లీగ్ హెడ్ ఆంటోనీ ఎవరెడీ స్పందించారు. మ్యాచ్ అధికారులు అందజేసిన నివేదికలో సూచించిన మార్పులు ఆధారంగా వెస్టిండిస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్‌కు బ్లాక్ బ్యాట్‌ను రూపొందించిన స్పార్టాన్ కంపెనీ కొత్త బ్యాట్‌ని రూపొందించిందని తెలిపారు.

క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం బంతికి నలుపు రంగు అంటుకోకుండా లామినేషన్‌తో కూడిన కవర్‌ని బ్యాట్‌పై ఉంచడం జరిగిందని, ఇలా చేయడం ద్వారా తాము సంతృప్తి చెందామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో బీబీఎల్ మ్యాచ్‌ల్లో ఆండ్రూ రస్సెల్ బ్లాక్ బ్యాట్‌తో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని ఆయన తెలిపారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఆమోదించడంతో ఆటగాళ్ల డ్రెస్ కోడ్‌ను బట్టి కలర్ బ్యాట్‌లను వాడేందుకు అనుమతి లభించింది. క్లబ్ ప్రైమరీ కలర్ ఏదైతే ఉంటుందో ఆటగాళ్లు వాడే బ్యాట్ కూడా ఆ కలర్‌లో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో బీబీఎల్ సీజన్‌లో వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ బంగారు పూత కల్గిన బ్యాట్‌ను వాడిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+