Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌‌షిప్ రేసులో బైజూస్, కోకో-కోలా, అమెజాన్‌!!

BYJUS, Coca Cola, Jio likely to join race for IPL 2020 title sponsorship

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020కి చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ సంస్థ 'వివో' ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. వివో లీగ్‌ నుంచి తప్పుకున్నట్లు రెండు రోజుల క్రితమే దాదాపు ఖరారైపోగా.. బీసీసీఐ మాత్రం గురువారం అధికారిక ప్రకటన జారీ చేసింది. 'ఐపీఎల్‌ 2020కి సంబంధించి బీసీసీఐ, వివో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి' అని స్పష్టం చేసింది. భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగానే వివోతో టైటిల్ స్ఫాన్సర్‌షిప్ ఒప్పందాన్ని బీసీసీఐ రద్దుచేసుకున్న విషయం తెలిసిందే.

 భాగస్వామ్యానికి విరామం:

భాగస్వామ్యానికి విరామం:

బీసీసీఐ ప్రకటన ప్రకారం చూస్తే ఐపీఎల్‌కు వివో దూరం కావడం ఈ ఒక్క ఏడాదికే పరిమితమని సమాచారం తెలుస్తోంది. ఆపై ఒప్పందాన్ని పునస్సమీక్షిస్తారా, మళ్లీ జత కడతారా అనేది మాత్రంబోర్డు ఎక్కడా ప్రస్తావించలేదు. సంవత్సరం తర్వాత పరిస్థితులు చక్కబడితే.. అప్పుడు దానిపై ఆలోచించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు తరఫునుంచి కనీసం కార్యదర్శి లేదా మరెవరి పేరు, సంతకం కూడా లేకుండా గురువారం బీసీసీఐ పత్రికా ప్రకటన జారీ చేయడం విశేషం. మరోవైపు ఐపీఎల్‌తో భాగస్వామ్యానికి విరామం ఇస్తున్నట్లు వివో ప్రకటించింది.

రేసులో మూడు సంస్థలు:

రేసులో మూడు సంస్థలు:

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుంది. ఇక వివో తప్పుకోవడంతో పలు ప్రముఖ సంస్థలు స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈసారి అంత భారీ మొత్తం కాకపోయినా.. కొంత తక్కువగా చెల్లించి స్పాన్సర్‌గా వ్యవహరించాలని ప్రధానంగా మూడు సంస్థలు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు బైజూస్. అమెజాన్‌, కోకో-కోలా కూడా రేసులోకి వచ్చాయట. జియో, పతాంజలి కూడా రేసులోకి వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా సూచిస్తున్నారు.

బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత:

బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత:

బైజూస్‌ సంస్థ ఇప్పటికే భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ భాగస్వామ్యం కారణంగా బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత దక్కవచ్చని సమాచారం. టీమిండియాలాగే బీసీసీఐకి చెందిన మెగా ఈవెంట్‌తో కూడా జతకట్టాలని ఆ కంపెనీ కోరుకుంటోంది. అయితే బైజూస్‌కు ప్రధానంగా భారతీయ కంపెనీ 'జియో' నుంచి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం అన్ని విధాలా దూసుకుపోతున్న జియోకు స్పాన్సర్‌షిప్‌ మొత్తం ఏ మాత్రం సమస్య కాకపోవచ్చు. ఐపీఎల్‌లో సగం జట్లకు అసోసియేట్‌ స్పాన్సర్‌గా జియో ఇప్పటికే వ్యవహరిస్తోంది కాబట్టి లీగ్‌ కొత్త కాదు.

రేసులోకి కోకాకోలా:

రేసులోకి కోకాకోలా:

క్రికెట్‌తో ఇప్పటి వరకు ఎక్కడా జతకట్టని మరో ప్రముఖ సంస్థ 'అమెజాన్‌' కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. అత్యంత ప్రజాదరణ ఉన్న ఆటతో అనుబంధం పెంచుకునేందుకు ఇది సరైన సమయంగా అమెజాన్‌ భావిస్తోంది. 'కోకాకోలా' కూడా రేసులో ఉన్నట్టు వినికిడి. కోకాకోలా పేరు వినిపిస్తున్నా.. మిగతా మూడింటితో పోలిస్తే ఈ సంస్థకు అవకాశాలు తక్కువే. తాజా సమాచారం ప్రకారం రూ. 250-300 కోట్లు స్పాన్సర్‌షిప్‌గా లభిస్తే చాలని బీసీసీఐ కోరుకుంటోంది. అయితే ఐపీఎల్ 2020 సీజన్ కోసం మాత్రమే టైటిల్ స్ఫాన్సర్‌‌‌షిప్ టెండర్‌ని బీసీసీఐ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.

ఆ విషయంలో.. ఐపీఎల్ 2020 సరికొత్త రికార్డు సృష్టిస్తుంది: ఎమ్మెస్కే

Story first published: Friday, August 7, 2020, 10:03 [IST]
Other articles published on Aug 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+