
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బైజూస్‌తో తన అనుబంధాన్ని మరింత కాలం పొడిగించింది. ప్రస్తుతం భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న బైజూస్ అనుబంధం శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌తో ముగియనుంది. అయితే తాజాగా బైజూస్‌తో ఒప్పందాన్ని బీసీసీఐ మరో ఏడాది వరకు పొడిగించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. దీంతో భారత క్రికెట్ జట్టు జెర్సీపై బైజూస్ మరో ఏడాది కాలంపాటు కనిపించనుంది. 2019 సెప్టెంబర్ నుంచి బైజూస్ టీమిండియాకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకుగాను బైజూస్ బీసీసీఐకి ద్వైపాక్షిక సిరీస్‌లకు రూ. 4.61 కోట్లు, అంతర్జాతీయ మ్యాచ్‌లకు రూ. 1.56 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. కాగా బైజూస్‌కు ముందు చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో టీమిండియాకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
కాగా భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్‌ను సునాయసంగా గెలుచుకున్న భారత జట్టు రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో పూర్తి అధిపత్యాన్ని కనబరిచిన టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో అజేయంగా 175 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో 9 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన జడ్డూ, సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడేజాకే దక్కింది. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 574-8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక శ్రీలంక విషయానికొస్తే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 174, సెకండ్ ఇన్నింగ్స్‌లో 178 పరుగులు మాత్రమే చేసింది.
రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)