ఐపీఎల్‌లో జాక్‌పాట్.. కుక్క కోసం బొమ్మలు!!

మెల్‌బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కోసం కోల్‌కతాలో ఈ నెల 19న వేలం పాట జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ప్రాంఛైజీలు విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. దీంతో కమ్మిన్స్ జాక్‌పాట్ కొట్టాడు. అతన్ని రూ. 15.5 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ చరిత్ర సృష్టించాడు.

ఆనందంలో కమిన్స్:
కమిన్స్‌కు భారీ మొత్తంలో నగదు లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియడం లేదన్నాడు. అయితే తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం ఐపీఎల్ డబ్బుతో మొదటగా తమ కుక్కకు కొన్ని బొమ్మలు కొందామని అంటోంది అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. మెల్‌బోర్న్ వేదికగా గురువారం న్యూజీలాండ్ జట్టుతో జరుగనున్న 'బాక్సింగ్ డే' టెస్ట్ సందర్భంగా కమిన్స్ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.

కుక్క కోసం బొమ్మలు:
'ఐపీఎల్ డబ్బుతో ఏం చేయాలో నాకు తెలీదు. నిజంగా చెపుతున్నా ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. కానీ.. నా గర్ల్‌ఫ్రెండ్ ఓ కోరిక కోరింది. ఆమెకు పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. ముందుగా కుక్కకు కొన్ని బొమ్మలు తీసుకుందామని చెప్పింది. కుక్కకు ఏమి అవసరమో అవి తీసుకోవాలి' అని కమ్మిన్స్ తెలిపాడు.

లీగ్‌లో ఆడటం నా అదృష్టం:
'ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. భారత గడ్డపై నా బౌలింగ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ వంటి పెద్ద లీగ్‌లో ఆడటం నా అదృష్టం. ఇంకా క్రికెట్ ఆడుతున్నానంటే నేను ఆటను ప్రేమించడమే అందుకు కారణం. నా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. జట్టులోని ఆటగాళ్లు, నా కుటుంబం, స్నేహితులు అందరూ నా మంచి కోరుకునేవారే. వారందరికి కృతజ్ఞుడను. నేను నిజంగా అదృష్టవంతుడిని' అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.

బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలడు:
కమిన్స్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అద్భుత బంతులతో మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా ముప్పుతిప్పలు పెట్టగలడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో వేసే బంతులకు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లాంటి వారి వద్ద సమాధానం ఉండదు. ఇక అవసరం అయినపుడు బ్యాటుతోనూ మెరవగలడు. ప్రస్తుతం కమిన్స్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. అందుకే అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications