Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెచ్చిపోయిన బట్లర్ రికార్డ్: 46 బంతుల్లో సెంచరీ

దుబాయ్: ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ 46 బంతుల్లో సెంచరీ చేశాడు. శుక్రవారం నాడు పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో అతను ఆకాశమే హత్తుగా చెలరేగిపోయాడు. 46 బంతుల్లోనే సెంచరీ చేసి ఇంగ్లాండ్ తరఫున వేగవంతమైన వన్డే శతకం సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

తొలి 19 బంతుల్లో 17 పరుగులే చేసిన బట్లర్‌ ఆ తర్వాత 33 బంతుల్లో 99 పరుగులు చేయడం గమనార్హం. వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకాల్లో బట్లర్‌ది ఆరో స్థానం. జెస్సి రైడర్‌ కూడా 46 బంతుల్లోనే సెంచరీ చేసి అతడితో సమానంగా ఉన్నాడు.

ఇంగ్లాండ్‌ తరఫున ఆ తర్వాత రెండు వేగవంతమైన శతకాలు కూడా బట్లర్‌వే (61, 66 బంతుల్లో) కావడం విశేషం. గతంలో 61 బంతుల్లో న్యూజిలాండ్ పైన, 66 బంతుల్లో శ్రీలంక పైన సెంచరీ చేశాడు. తాజా వన్డేలో అతను పద్దెనిమిది ఫోర్లు, సిక్స్‌లు ఉన్నాయి.

Buttler's record-breaking ton demolishes Pakistan

మొత్తంగా.. అతను శుక్రవారం 52 బంతుల్లో 116 పరుగులు చేశాడు. అందులో పది ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు ఉన్నాయి. ఇతను ఇంగ్లాండ్‌ వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మన్‌. జేసన్‌ రాయ్‌ 117 బంతుల్లో 102 పరుగులు, జో రూట్‌ 71 బంతుల్లో 71 పరుగులు చేశారు.

దీంతో ఇంగ్లాండ్‌ 84 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది. నాలుగు వన్డేల సిరీస్‌ను 3-1తో ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. మొదట 5 వికెట్లకు 355 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ను 271 పరుగులకు ఆలౌట్‌ చేసింది. బాబర్‌ అజామ్‌ 51, షోయబ్‌ మాలిక్‌ 52, అజహర్‌ అలీ 44 పరుగులు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+