న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో మెరుపులు అతడికి టెస్టు జట్టులో చోటు కల్పించాయి

By Nageshwara Rao
Buttler recalled to England Test squad, Bess earns maiden call

హైదరాబాద్: దాదాపు ఏడాదిన్నర తర్వాత జోస్ బట్లర్‌కు సెలక్టర్లు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం కల్పించారు. లార్డ్స్‌లో పాకిస్థాన్‌తో మే 24 నుంచి జరుగనున్న తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన 12 మంది సభ్యుల జట్టులో బట్లర్‌కు చోటు దక్కించుకున్నాడు.

యాషెస్‌ సిరిస్‌లో జేమ్స్‌ విన్స్‌ విఫలం

యాషెస్‌ సిరిస్‌లో జేమ్స్‌ విన్స్‌ విఫలం

ఈ మ్యాచ్‌లో అతను వికెట్‌కీపర్‌గా కాకుండా రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడు. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరిస్‌లో జేమ్స్‌ విన్స్‌ విఫలమవడంతో అతని స్థానాన్ని సెలక్టర్లు జోస్ బట్లర్‌తో భర్తీ చేశారు. అంతకముందు కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్థానం పొందిన బట్లర్‌ మిడిలార్డర్‌లో ఆశించినంతగా రాణించలేదు.

 జోస్ బట్లర్‌ వరుసగా హాఫ్ సెంచరీలు

జోస్ బట్లర్‌ వరుసగా హాఫ్ సెంచరీలు

అయితే, ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న జోస్ బట్లర్‌ వరుసగా ఐదు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో సెలక్టర్లు బట్లర్‌ను టెస్టుల్లోకి మళ్లీ తీసుకునేందుకు సరైన సమయంగా భావించినట్లు సెలక్టర్లు ప్రకటించారు.

ఆఫ్‌ స్పిన్నర్‌ డొమినిక్‌ బెస్‌కు కూడా అవకాశం

ఆఫ్‌ స్పిన్నర్‌ డొమినిక్‌ బెస్‌కు కూడా అవకాశం

కొత్తగా ఆఫ్‌ స్పిన్నర్‌ డొమినిక్‌ బెస్‌కు కూడా అవకాశం కల్పించారు. వన్డేలు, టి20ల్లో రెగ్యులర్‌ సభ్యుడైన జోస్ బట్లర్‌ ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరుపున 18 టెస్టులాడాడు. లార్డ్స్ వేదికగా జరిగే తొలి టెస్టుకు సంబంధించిన 12 మంది సభ్యులతో కూడిన ఇంగ్లాండ్‌ జట్టును మంగళవారం ప్రకటించారు.

పాకిస్థాన్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు:

జో రూట్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, జానీ బెయిర్‌స్టో, డామ్‌ బెస్‌, స్ట్టువర్ట్‌ బ్రాడ్‌, జోస్‌ బట్లర్‌, కుక్‌, డేవిడ్‌ మలన్‌, బెన్‌ స్టోక్స్‌, స్టోన్‌మన్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ ఉడ్‌.

Story first published: Wednesday, May 16, 2018, 10:12 [IST]
Other articles published on May 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X