Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తీరు మారలేదు: టీ20లో కూడా ఆస్ట్రేలియా ఓటమి

Buttler punishes Australia again in T20 success

హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌‌లో వైట్‌వాష్‌కు గురైన ఆస్ట్రేలియా, ఏకైక టీ20లోనూ ఓటమిపాలైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియాపై 28 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జోస్‌ బట్లర్‌ (61; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల వద్ద స్టాన్‌లేక్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ఆ తర్వాత మరో ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ (44; 26 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఆనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మరింత రెచ్చిపోయి ఆడారు. చివర్లో అలెక్స్‌ హేల్స్‌ (49), రూట్‌ (35) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్వెప్సన్‌ రెండు వికెట్లు తీయగా... స్టాన్‌లేక్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి 193 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఆరోన్‌ ఫించ్‌ (84; 41 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు.

మిగతా వారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్‌, జోర్డాన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా... ప్లంకెట్‌ రెండు వికెట్లు, విల్లీ, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ తీశారు. ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన రషీద్‌‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Thursday, June 28, 2018, 10:23 [IST]
Other articles published on Jun 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+