
న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా ఓ వైపు భారత్, పాక్ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటే.. మరోవైపు మరికొందరి చూపు మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చిన ఓ అమ్మాయిపై పడింది. తానేమీ చేయకపోయినా తన అందానికే ముగ్దులైన అబ్బాయిల గుండెల్లో వేగాన్ని పెంచింది. ఆమె ఫొటోలతోనే సామాజిక మాధ్యమాలు నిండిపోయాయి.
కేవలం ఆమెను చూసేందుకు.. కొంతమంది ..పాకిస్థాన్‌తో మరిన్ని మ్యాచ్‌లు కావాలంటూ బీసీసీఐను కోరారట. ఆ మ్యాచ్‌లకు అమ్మాయి హాజరవుతుందని వారి చిన్న ఆశ. భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరైన ఆవిడ.. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడిన మ్యాచ్‌కు కూడా హాజరై ఫొటోలకు చిక్కింది. ఆమె కోసం అంతగా ఆరా తీస్తోన్న వారికి ఎట్టకేలకు ఆమె, పేరు అభిరుచులు కూడా తెలిశాయి.
తన పూర్తి పేరు నివ్యా నవోరా. ఆమెకు బాలీవుడ్ అన్నా, షారుఖ్ అన్నా పిచ్చి అభిమానమట. ఆమె ఇన్‌స్టాగ్రాం ఖాతాలో 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వివరాలతో ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రాంను స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేశారు ఓ నెటిజన్. ఈ ఆదివారం జరగబోయే మ్యాచ్‌కు కూడా హాజరవుతుందని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరో పక్క టీమిండియా ఆసియా కప్‌లో పాక్ జట్టుపై పంజా విసిరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో.. ఆదివారం పాక్‌తో తలపడనున్న భారత్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. పాకిస్తాన్ మాత్రం టోర్నీలో మ్యాచ్ గెలిచేందుకు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. కానీ, భారత్-పాక్ మ్యాచ్ అంటే పరిస్థితులను ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే ఇదే టోర్నీలో దాయాది జట్ల మధ్య రెండో సారి జరగనున్న మ్యాచ్‌పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.