For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ వీడియో కోసం బస్సు డ్రైవర్ మాస్టర్ ప్లాన్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా కోహ్లీ కనిపిస్తే చాలు కెమెరాలు అన్నీ అతనివైపే ఉంటాయి. విజయ్ హజారే ట్రోఫీలో కింగ్ కోహ్లీ సందడి మామూలుగా లేదు. ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్‌ను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ వీడియో తీయడానికి ఢిల్లీ టీమ్ బస్సు డ్రైవర్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఆ డ్రైవర్ కోహ్లీకి తెలియకుండా ఆయన వీడియో తీయడానికి ఒక వెరైటీ ట్రిక్ ఉపయోగించాడు.

ఏమిటా ట్రిక్?
శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్ తన ఫోన్‌ను పక్కన ఒక చోట సెట్ చేసి పెట్టాడు. తను డ్రైవింగ్ సీటులో సీరియస్‌గా కూర్చున్నట్లు నటిస్తూనే.. వెనుక నుంచి విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, ఇతర టీమ్ మెంబర్స్ బస్సు దిగుతుండగా అందరూ ఒకే ఫ్రేమ్‌లో పడేలా రికార్డ్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవర్ మెయింటైన్ చేసిన ఆ 'సీరియస్ ఎక్స్‌ప్రెషన్' ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Bus Driver Clever Trick to Record Virat Kohli Goes Viral Funny Video Breaks Internet

విజయ్ హజారేలో కోహ్లీ వీరవిహారం
కేవలం వీడియోలతోనే కాదు, తన బ్యాట్‌తో కూడా కోహ్లీ గర్జిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 101 బంతుల్లో 131 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. గుజరాత్‌పై 77 పరుగులు చేయడంతో విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 208 పరుగులు (సగటు 104) సాధించి కింగ్ ఈజ్ బ్యాక్ అని నిరూపించుకున్నాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం సిద్ధం కావడానికి కోహ్లీ ప్రస్తుతం ముంబై చేరుకున్నాడు.

Story first published: Saturday, December 27, 2025, 15:21 [IST]
Other articles published on Dec 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+