సిడ్నీ మైదానంలో కోచ్ లాంగర్ నేతృత్వంలో వార్నర్ నెట్ ప్రాక్టీస్ (వీడియో)

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో వార్నర్ ఆస్ట్రేలియా పేసర్లు హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ బంతులను ఎదుర్కొంటూ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ నేతృత్వంలో వార్నర్ ప్రాక్టీస్ చేయడం విశేషం. బాల్ టాంపరింగ్ కారణంగా ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, వార్నర్‌లపై అ దేశ క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేధం విధించింది. దీంతో వీరిద్దరూ ఏడాదిపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యారు.
ఆస్ట్రేలియా వరుస ఓటముల నేపథ్యంలో
అయితే దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం కల్పించింది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా వరుస ఓటముల నేపథ్యంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ క్రికెట్ ఆస్ట్రేలియాను అభ్యర్థించింది. అయితే నిషేధం విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని సీఏ తేల్చి చెప్పింది.

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (33), ఫించ్ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్ (25 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.

డిసెంబర్ 6 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్
ఓపెనర్ శిఖర్ ధావన్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23), దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 22 నాటౌట్) రాణించారు. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఇక, భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications