'బుమ్రా కెరీర్ ఓవర్.. ఇక అదే రిపీట్ అయితే బ్యాగ్ సర్దుకోవాల్సిందే'
గాయం కారణంగా రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బుమ్రా పాల్గొనలేదన్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్ లోని తొలి రెండు వారాల్లోనూ అతడు పాల్గొనడం అనుమానమేనని మాటలు వినిపిస్తున్నాయి. అలానే అతడు జూన్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచుల టెస్ట్ సిరిస్ లోనూ పాల్గొనడం అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టార్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"బుమ్రా సిడ్నీ టెస్ట్ సమయంలో స్కానింగ్ కు వెళ్లినప్పుడు అతడు మళ్లీ గాయపడతాడని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే అతడి వెన్నుముకలో గాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో ఆడడని అనుకున్నాను. అదే జరిగింది. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. బుమ్రా మళ్లీ సాధరణ స్థితికి వస్తాడని అంటున్నారు. కానీ నాకు అనుభవంతో చెబుతున్నాను.. అతడు మరోసారి గాయపడి సర్జరీ చేయించుకుంటే, అతడి క్రికెట్ కెరీర్ ముగిసినట్టే."

"ఎందుకంటే ఒకే చోటు రెండు సర్జరీలు చేయించుకుంటే, దాని నుంచి కోలుకోవడం కష్టం. కాబట్టి బీసీసీఐ.. బుమ్రాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వరుసగా రెండు టెస్ట్ మ్యాచులు కన్నా ఎక్కువ ఆడనివ్వకూడదు. అతడిని జాగ్రత్తగా చూసుకోండి. బుమ్రా 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలనుకుంటే, అతడిని ఎక్కువ టెస్టుల్లో ఆడనివ్వకూడదు. ఉదాహరణకు, ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరిగితే, అందులో మూడు మ్యాచులు మాత్రమే అతడిని ఆడిపించాలి. వన్డే క్రికెట్ లో వారానికి మూడు మ్యాచులు ఉంటే.. అతడి చేత మ్యాక్సిమమ్ 30 ఓవర్లు మాత్రమే వేయిచాలి. టీ20లోనూ ఒక సిరీస్ లో దాదాపుగా 20 ఓవర్లు మాత్రమే వేయించాలి. ఏదేమైనా అతడిని ఎక్కువగా ఆడిస్తే రిస్క్ చేసినట్టే. అతడు కంటిన్యూగా ఆడితే మళ్లీ గాయపడతాడు." అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications