INDvsAUS : ఆసీస్‌తో బుమ్రా ఆడటం వేస్ట్.. మాజీ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకున్నాడని అనుకున్న ప్రతిసారీ ఈ సమస్య మరింత పెద్దదై బుమ్రాను ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్‌లో కూడా అతను ఆడలేదు. ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అతను లేడు. చివరి రెండు టెస్టులతోపాటు ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కోసం కూడా సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు.

ఈ టెస్టుల్లో బుమ్రా వేస్ట్..
ఇదంతా చూసిన ప్రముఖ కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. 'బుమ్రాకు ఇంకా ఎన్సీయే నుంచి క్లియరెన్స్ రాలేదు. అతను చివరి రెండు టెస్టులు కూడా ఆడటం లేదు. వన్డేలకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు. టెస్టుల్లో అతన్ని సెలెక్ట్ చేసినా కూడా ఏం చేస్తాడు? నేనైతే అతన్ని ఈ టెస్టుల్లో ఆడించే వాడినే కాదు' అని తేల్చేశాడు. ఆసీస్‌తో సిరీస్‌లో బుమ్రా అవసరం పెద్దగా లేదని చెప్పిన చోప్రా.. ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే మాత్రం, ఇంగ్లండ్‌లో బుమ్రా కీలకం అవుతాడని అన్నాడు.

ఓవల్‌లో చాలా కీలకం..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో బుమ్రా చాలా కీలక పాత్ర పోషిస్తాడని చెప్పిన చోప్రా.. 'అతను దేశానికి దొరికిన వజ్రంలాంటి వాడు. కాబట్టి అతన్ని కావలసినంత విశ్రాంతి తీసుకోమని చెప్తా. చాలా జాగ్రత్తగా ఉండాలని నా సలహా. చాలా కాలం ఆటకు దూరమయ్యాడు. కానీ ఫిట్‌నెస్ సాధిస్తే ఓవల్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతన్ని ఆడించాలి' అని తెలిపాడు. మహమ్మద్ షమీ, సిరాజ్‌తో బుమ్రా కలిస్తే భారత పేస్ బౌలింగ్ విభాగం చాలా ప్రమాదకరంగా మారుతుందన్నాడు. అలాగే బుమ్రా మళ్లీ ఆడటం మొదలు పెడితే ముందుగా నాలుగు ఓవర్ల స్పెల్స్ వేయడం మంచిదని, వన్డేల కన్నా పొట్టి ఫార్మాట్‌తో ఆట మొదలు పెడితే బాగుంటుందని చెప్పాడు.

ఐపీఎల్ ఆడటంపై..
అలాగే చాలా మంది ఫ్యాన్స్ బుమ్రాపై విమర్శలు చేయడాన్ని కూడా ఎత్తి చూపాడు. అతను భారత్ తరఫున ఆడడు కానీ, ఐపీఎల్ నాటికి ఫిట్‌నెస్ సాధిస్తాడని కొందరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా చోప్రా స్పందించాడు. 'చాలా మంది అతను ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతడని అంటున్నారు. కానీ ఈసారి అతని వర్క్‌లోడ్‌ను బీసీసీఐ మేనేజ్ చేస్తుందని మర్చిపోతున్నారు. ఆటగాడితోపాటు ఫిజియోతో కూడా బీసీసీఐ టచ్‌లో ఉంటుంది. ఎంత వరకు కష్టపడొచ్చో కూడా బీసీసీఐ నిర్ణయిస్తుంది' అని తేల్చేశాడు. అదే సమయంలో ఏ ఫ్రాంచైజీ కూడా ఒక భారత ఆటగాడు దేశాన్ని వదిలేసి తమకు ఆడాలని అనుకోదని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications