ఆస్ట్రేలియాతో మూడు వన్డే సిరిస్: బుమ్రాకి విశ్రాంతి, సిరాజ్‌కు పిలుపు


హైదరాబాద్: జనవరి 12 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరిస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు సైతం టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ టెస్టు సిరిస్‌లో జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లు తీయడం విశేషం. ఓ టెస్టు సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో బుమ్రా (21 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
బుమ్రాకి విశ్రాంతి
1991/92 ఆసీస్ పర్యటనలో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(25) వికెట్లు తీశాడు. అయితే అది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కావడం విశేషం. "వర్క్ లోడ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే వన్డే సిరిస్ నుంచి బుమ్రాకు విశ్రాంతినిచ్చాం. బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశాం" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

జనవరి 12న సిడ్నీలో తొలి వన్డే
ఇక, న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరిస్‌కు పేసర్ సిద్ధార్ధ్ కౌల్‌కు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. జనవరి 12 నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది.

2-1తో టెస్టు సిరిస్ కైవసం
సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. 1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు.

6-వికెట్ హాల్ సాధించిన బుమ్రా
ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో నాలుగు సార్లు 6-వికెట్ హాల్స్‌ను ఇరు జట్ల బౌలర్లు సాధించారు. నాథన్ లియాన్(6/122), మహమ్మద్ షమీ(6/33), బుమ్రా(6/33), కమ్మిన్స్(6/27)లు ఈ ఘనత సాధించారు. 2010/11 యాషెస్ సిరిస్ తర్వాత ఆసీస్ గడ్డపై నాలుగు సార్లు 6-వికెట్ హాల్స్ నమోదైన రెండో టెస్టు సిరిస్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications