
బౌలర్‌గా..
తొలి ఇన్నింగ్‌లో బ్యాటింగ్‌లో చెలరేగిన ఈ పేసర్.. బౌలర్‌గానూ సత్తా చాటుతున్నాడు. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. అనంతరం మూడు వికెట్లను పడగొట్టాడు. అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఒల్లెపోప్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. ఈ ఊపుతో మిగిలిన బౌలర్లు కూడా ఇంగ్లాండ్ బ్యాటర్ల భరతం పట్టారు. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్.. నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. మహ్మద్ షమీ-2, శార్దుల్ ఠాకూర్ ఓ వికెట్ తీసుకున్నారు.

కేప్టెన్సీ ఇచ్చిన ఊపులో..
ఫలితంగా- మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 257 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది. ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. దీనితో ఆధిక్యత మరింత పెరిగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా- కేప్టెన్సీ ఇచ్చిన ఊపులో జస్‌ప్రీత్ బుమ్రా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే అతను ఈ సీజన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా పేరు లిఖించుకున్నాడు.

భువి రికార్డు అవుట్..
తాజాగా మరో రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ పేరు మీద ఉన్న రికార్డును అధిగమించాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు బూమ్ బూమ్ బుమ్రా. 2021-2022 సీజన్‌లో ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై 21 వికెట్లు పడగొట్టాడు. ఈ స్థాయిలో వికెట్లు తీసుకున్న మరో టీమిండియా బౌలర్ లేడు. ఈ క్రమంలో అతను భువనేశ్వర్ కుమార్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, సుభాష్ గుప్తేను దాటేశాడు.

వారందరినీ దాటుకుని..
2014లో భువనేశ్వర్ కుమార్ ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. అదే అత్యధికం. దానికంటే ముందు 2018లో ఇషాంత్ శర్మ 18 వికెట్లు తీసుకున్నాడు. 2007లో జహీర్ ఖాన్ కూడా 18 వికెట్లతో టాపర్‌గా నిలిచాడు. 1959లో అప్పటి టీమిండియా బౌలర్ సుభాష్ గుప్తే 17 వికెట్లు పడగొట్టాడు. వారందరినీ దాటుకున్నాడు జస్‌ప్రీత్ బుమ్రా. 21 వికెట్లతో అగ్రస్థానానికి అధిరోహించాడు. ఇంగ్లాండ్ ఇంకా రెండో ఇన్నింగ్ కూడా ఆడాల్సి ఉన్నందున.. ఈ సంఖ్య పెరగడం దాదాపు ఖాయమైనట్టే.


Click it and Unblock the Notifications












