

లండన్: టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు నోబాల్స్‌లో వికెట్ తీయడం ఓ అలవాటుగా మారిపోయింది. ఈ నోబాల్స్ అతడి కెరీర్‌కు మాయని మచ్చలాగా ఉండిపోతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ బట్లర్, స్టోక్స్ నిలకడగా ఆడుతున్న సమయంలో బుమ్రా వరుసగా నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
తన కెరీర్‌లో తొలిసారి ఐదో వికెట్ తీసిన బుమ్రా, అది నోబాల్ కావడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ రషీద్ ఊపిరి పీల్చుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో రషీద్ స్లిప్‌లో ఉన్న కోహ్లికి క్యాచ్ ఇచ్చినా.. అది నోబాల్ అని రీప్లేల్లో తేలింది. తనకు లభించిన లైఫ్‌తో రషీద్ భారత విజయాన్ని మరింత ఆలస్యం చేశాడు.
మరో ఎండ్‌లో ఉన్న స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అయితే, ఆ తర్వాత బ్రాడ్‌ను పెవిలియన్‌కు చేర్చి బుమ్రా తన కెరీర్‌లో ఐదో వికెట్ తీసుకున్నాడు. బుమ్రా నో బాల్‌తోనే మూడో టెస్టులో భారత విజయం ఆలస్యం అయిందంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కాగా, గతేడాది పాక్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా బుమ్రా నోబాల్‌కే వికెట్ తీశాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ ఫకర్ జమాన్ వికెట్‌ను బుమ్రా తీసినా.. అది నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆ తర్వాత అతడు హాఫ్ సెంచరీ చేసి పాకిస్థాన్‌ను గెలిపించాడు. అప్పుడు కూడా బుమ్రాను నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.