బ్యాట్స్‌మెన్‌కు సవాల్: బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించిన కమిన్స్


హైదరాబాద్: టీమిండియా యువ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు మీడియాతో మాట్లాడిన ప్యాట్ కమ్మిన్స్ బుమ్రా బౌలింగ్ అద్భుతమంటూ కొనియాడాడు.

బుమ్రా బౌలింగ్ అద్భుతం
కమిన్స్ మాట్లాడుతూ "బుమ్రా బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది. అతడి బౌలింగ్‌లో రెండు ప్రాథమిక అంశాలు బాగుంటాయి. ఒకటి వేగంగా బంతి విసురుతాడు. రెండోది కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అలా బంతులు విసిరే బౌలర్లు ఎవరైనా సరే బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా మారతారు" అని అన్నాడు.

మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు
"బుమ్రా అద్భుతంగా స్లో బంతులు వేస్తాడు. మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉంది. తన నైపుణ్యాలను చక్కగా అమలు చేస్తాడు. మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం" అని కమిన్స్ తెలిపాడు. కాగా, విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన బుమ్రా టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

రెండో టీ20లో అరుదైన రికార్డుకి చేరువలో బుమ్రా
ఇదిలా ఉంటే, బుధవారం బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టీ20లో బుమ్రా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. ప్రస్తుతం బుమ్రా 41 మ్యాచుల్లో 51 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ 52 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అతనికి చేరువయ్యేందుకు బుమ్రా ఒక వికెట్ దూరంలో నిలిచాడు.

అశ్విన్ రికార్డుని సవరించే అవకాశం
రెండో టీ20లో బుమ్రా అశ్విన్ రికార్డుని సవరించే అవకాశం ఉంది. రెండో టీ20లో బుమ్రా మరో రెండు వికెట్లు తీస్తే.. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్ 52 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అశ్విన్ 46 మ్యాచుల్లో 52 వికెట్లు తీశాడు. అతని కంటే నాలుగు మ్యాచ్‌లు ముందుగానే బుమ్రా ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications