Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బుమ్రా, భువీలు సరే, కోహ్లీకి మాత్రం కష్టకాలం మొదలైనట్లే'

Kohli Made Me Realise the Importance of Fitness,Says Chahal
Bumrah and Bhuvi will impress in England, but will Kohli and Co oblige, wonders McGrath

హైదరాబాద్: భార‌త ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ త్వరలో ఆరంభం కానున్న ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇబ్బందులు తప్పవని ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ‍్రాత్‌ అభిప్రాయపడ్డాడు. పరుగుల యంత్రం కోహ్లి విశేష అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంగ్లండ్‌ గడ్డపై అండర్సన్‌ నుంచి ముప్పు పొంచి వుందన్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని మైదానాల్లోనూ చెల‌రేగి ఆడే కోహ్లీ ఇంగ్లాండ్‌లో మాత్రం త‌న స‌త్తా చాట‌లేక‌పోతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లు కోహ్లీకి నిరాశనే మిగిల్చాయి.

ఇంగ్లాండ్‌లో విరాట్‌కు ఇబ్బందులు

ఇంగ్లాండ్‌లో విరాట్‌కు ఇబ్బందులు

కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డపై నెగ్గుకురావడం అంత సుల‌భం కాద‌ని ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఫాస్ట్ బౌల‌ర్ మెక్‌గ్రాత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇంగ్లాండ్‌లో విరాట్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వని మెక్‌గ్రాత్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌల‌ర్ అండ‌ర్స‌న్‌ను ఎదుర్కొని ప‌రుగులు చేయ‌డం కోహ్లీకి అంత సుల‌భం కాద‌ని పేర్కొన్నాడు. ప్రస్తుతం సొంత గడ్డపై సత్తాచాటుతున్న అండర్సన్‌.. కోహ్లిపై పైచేయి సాధించడం ఖాయమని జోస్యం చెప్పాడు.

అండర్సన్‌ బౌలింగ్‌లో కోహ్లి తడబడతాడనే:

అండర్సన్‌ బౌలింగ్‌లో కోహ్లి తడబడతాడనే:

‘విరాట్‌ కోహ్లి అనుభవం ఉన్న ఆటగాడు. నాణ్యమైన ఆటగాడు కూడా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అక్కడ పరిస్థితులు మనకు అనుగుణంగా ఉండవు. ఆ జట్టు బౌలర్‌ అండర్సన్‌ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. అండర్సన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లి తడబడతాడనే అనుకుంటున్నా.

జట్టంతా ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడటం

జట్టంతా ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడటం

ఇంగ్లిష్‌ పర్యటనలో జట్టంతా ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడటం సరికాదు. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో అతడు ఫెయిలైనా మిగిలిన వారు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. భారత జట్టులో చతేశ్వర పుజారా కీలక ఆటగాడు. మరి ఈ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

 భువనేశ్వర్‌, బుమ్రా చాలా బాగా బౌలింగ్‌ వేస్తున్నా

భువనేశ్వర్‌, బుమ్రా చాలా బాగా బౌలింగ్‌ వేస్తున్నా

భారత బౌలర్లు భువనేశ్వర్‌, బుమ్రా చాలా బాగా బౌలింగ్‌ వేస్తున్నారు. నా అంచ‌నా ప్ర‌కారం ఈ ప‌ర్య‌ట‌న‌లో పూజారా బాగా రాణిస్తాడ‌నుకుంటున్నా. భార‌త బౌల‌ర్లు బుమ్రా, భువ‌నేశ్వ‌ర్‌లు కూడా క‌చ్చితంగా స‌త్తా చాటుతారు` అని మెక్‌గ్రాత్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

Story first published: Tuesday, June 5, 2018, 14:20 [IST]
Other articles published on Jun 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+