Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. కావ్య మేడమ్‌ మాస్టర్ మైండ్!

ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న నిర్ణయాలపై మిశ్రమ స్పందన దక్కింది. హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్ వేలంలో మంచి నిర్ణయాలు తీసుకున్నారని కొందరు మెచ్చుకుంటే.. విదేశీ ప్లేయర్లపైనే అధికంగా శ్రద్ధ పెట్టారని మరికొందరు విమర్శించారు. అయితే కావ్య తీసుకున్న నిర్ణయాలు గొప్పగా ఉన్నాయనేలా ఓ వార్తతో స్పష్టతమవుతుంది.

ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం ప్రక్షాళన చేపట్టిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. తాజాగా కొత్త కెప్టెన్లను నియమించింది. టీ20 జట్టుకు కెప్టెన్‌‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా ప్లేయర్ హసరంగను ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన వేలంలో హసరంగను హైదరాబాద్ రూ.1.50 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ స్పిన్నర్‌కు వేలంలో భారీ డిమాండ్ ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ ఎస్‌ఆర్‌హెచ్ తక్కువగా ధరకే సొంతం చేసుకుంది.

Bumper offer for Sunrisers Hyderabad Player. Wanindu Hasaranga to lead the Sri Lanka T20I sides

ఇటీవల ముగిసిన ప్రపంచకప్ వరకు శ్రీలంక వైట్ బాల్ టీమ్ కెప్టెన్‌గా షనక ఉన్నాడు. అయితే అతడిని తప్పిస్తూ వన్డేల్లో కొత్త కెప్టెన్‌గా కుశాల్ మెండిస్‌ను, టీ20లో హసరంగను నియమించింది. ఇక టెస్టుల్లో కెప్టెన్‌గా కరుణరత్నె కొనసాగుతున్నాడు. దీంతో శ్రీలంకకు తొలిసారి మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. 2021లో రెగ్యులర్ కెప్టెన్‌‌గా షనక బాధ్యతలు అందుకున్నాడు. అతడు 2022 ఆసియాకప్‌లో శ్రీలంకను విజేతగా నిలిపాడు.

ఇక షనక కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్, భారత్‌పై టీ20 సిరీస్ సాధించడం మరికొన్ని గొప్ప విజయాలు. అయితే బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడం అతడి కెప్టెన్సీపై వేటు పడటానికి ప్రధాన కారణంగా మారింది. మరోవైపు కొత్త వన్డే కెప్టెన్ కుశాల్ మెండిస్ అండర్-19 జట్టును నడిపించిన అనుభవం ఉంది. అలాగే గాయంతో షనక జట్టుకు దూరమవ్వగా వన్డే ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక హసరంగ సారథిగా లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ జట్టుకు టైటిల్ అందించాడు.

హసరంగ లంక కెప్టెన్‌‌గా ఎంపిక అవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు‌లో కెప్టెన్సీ అనుభవం ఉన్న ప్లేయర్ల సంఖ్య మూడుకు చేరనుంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ మార్క్‌రమ్‌తో పాటు ప్యాట్ కమిన్స్, హసరంగ ఉన్నారు. ఇక వేలంలో కమిన్స్ కోసం హైదరాబాద్ రూ.20.50 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. కమిన్స్‌కు భారీ ధర చెల్లించడం వెనుక అతడిని కెప్టెన్‌గా నియమించే అవకాశాలూ ఉన్నాయని తెలుస్తోంది.

వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన ప్లేయర్లు: కమిన్స్‌ (రూ.20.50 కోట్లు), ట్రేవిస్‌ హెడ్‌ (రూ.6.80 కోట్లు), జైదేవ్‌ ఉనద్కత్‌ (రూ.1.60 కోట్లు), హసరంగ (రూ.1.50 కోట్లు), జాతవేద్‌ సుబ్రమణ్యన్‌ (రూ.20 లక్షలు), ఆకాశ్‌ సింగ్‌ (రూ.20 లక్షలు)

Story first published: Sunday, December 31, 2023, 13:39 [IST]
Other articles published on Dec 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+