ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే! 2 పరుగులకే ఆలౌట్.. 10 మంది డకౌటే! అత్యంత దారుణమైన ఓటమి!

హైదరాబాద్: టీ20 క్రికెట్, టీ10 క్రికెట్ వచ్చాక బ్యాట్స్‌మన్‌ పరుగుల వరద పారిస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో కూడా అలవోకగా హాఫ్ సెంచరీ, సెంచరీలు బాదేస్తున్నారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో జట్లు భారీ స్కోర్లు నమోదుచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌లోని ఓ వన్డే జట్టు కేవలం రెండు పరుగులకే ఆలౌట్ అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ మ్యాచ్ గురించే వార్తలు కనబడుతున్నాయి.

అలీ హాఫ్ సెంచరీ

అలీ హాఫ్ సెంచరీ

హంటింగ్‌డన్‌షైర్ కౌంటీ లీగ్ మ్యాచ్‌లో బక్డెన్​ క్రికెట్ క్లబ్ 2 పరుగులకే ఆలౌట్ అయింది. లీగ్​లో భాగంగా బక్డెన్​ క్రికెట్ క్లబ్-ఫాల్కన్ మధ్య వన్డే మ్యాచ్​ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్​ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఫాల్కన్ జట్టు ఆటగాళ్లు ఫహీమ్ సబీర్ భట్టి (65), మురాద్ అలీ (67) హాఫ్ సెంచరీలు చేశారు. జుబైర్ ముహమ్మద్ (24), సాకిబ్ హఫీజ్ దార్ (31) పర్వాలేదనిపించారు. ఇన్నింగ్స్ మొదటలో తడబడ్డ ఫాల్కన్ జట్టు.. భట్టి, అలీ హాఫ్ సెంచరీలు చేయడంతో భారీ స్కోర్ చేసింది. బక్డెన్​ క్రికెట్ క్లబ్ బౌలర్లు 24 రన్స్ అదనంగా ఇచ్చారు. బెన్ మెక్‌కట్చోన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

2 పరుగులకే ఆలౌట్

2 పరుగులకే ఆలౌట్

261 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన బక్డెన్ క్రికెట్ క్లబ్8.3 ఓవర్లలో 2 పరుగులకే ఆలౌట్ అయింది.​ బక్డెన్ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్​మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారు. అమన్‌దీప్ సింగ్, హేదర్ అలీ దెబ్బకు ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోయారు. అమన్‌దీప్ నాలుగు ఓవర్లు వేయగా.. నాలుగు మెయిడిన్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. అలీ 4.3 ఓవర్లలో రెండు మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. స్కోర్ బోర్డుపై నమోదైన ఆ రెండు రన్స్ కూడా వైడ్, బై రూపంలో వచ్చినవే. బక్డెన్ 2 పరుగులకే ఆలౌటవ్వడంతో ఫాల్కన్ జట్టు 258 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

IPL 2021 రెండోదశ కష్టమే.. వాళ్లదే తుది నిర్ణయం!!

ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే

ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే

హంటింగ్‌డన్‌షైర్ కౌంటీ లీగ్​లో భాగంగా జూన్ 19న బక్డెన్​ క్రికెట్ క్లబ్-ఫాల్కన్ మధ్య వన్డే మ్యాచ్​ జరిగింది. అంతర్జాతీయ మ్యాచ్ కాకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మ్యాచుకు సంబందించిన స్కోర్ బోర్డు నెట్టింట వైరల్ అయింది. బక్డెన్ ప్లే క్రికెట్.కామ్ (https://buckden.play cricket.com/website/results/4572794)లో స్కోర్ బోర్డు ఉంది. ఇది చూసిన ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే!' అని ఒకరు కామెంట్ చేయగా.. '2 పరుగులకే ఆలౌట్ ఏందీ సామీ' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఒక్క బ్యాట్స్​మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారా అని ఫాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

15 మంది ఈ మ్యాచ్​కు గైర్హాజరు

15 మంది ఈ మ్యాచ్​కు గైర్హాజరు

దారుణ ఓటమి తర్వాత బక్డెడ్ జట్టు కెప్టెన్ జోయల్ కిర్​చ్నర్​ మాట్లాడుతూ... 'మా జట్టులోని 15 మంది ఈ మ్యాచ్​కు గైర్హాజయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల వారంతా ఆడలేదు. చేసేది లేక రెండో జట్టుతో బరిలో దిగాం. ఇక ఆట ప్రారంభమయ్యే సమయానికి 8 మందిమే ఉన్నాం. వ్యక్తిగత పని చూసుకొని 30 ఓవర్ సమయంలో గ్రహమ్ పీర్స్​ వచ్చాడు. ఇది అత్యంత చెత్త జట్టని నేను అంగీకరిస్తున్నా. ఇంతకుముందు ఫాల్కన్​తో జరిగిన మ్యాచ్​లో 9 పరుగుల తేడాతో మాత్రమే ఓడిపోయాం' అని వివరించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 22, 2021, 16:08 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X