For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్న వెళ్లిన చోటుకే తమ్ముడు.. ఆ స్పిన్నర్ కోరికను మన్నించిన సీఎస్కే!

IPL Auction 2026: ఐపీఎల్ 2026 మినీ వేలంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను అదృష్టం వరించింది. గత సీజన్లలో అంతంత మాత్రంగానే రిజల్ట్ సాధించినప్పటికీ.. ఈ సారి వేలంలో రాహుల్ చాహర్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తాన్ని వెచ్చించి రాహుల్ చాహర్‌ను తమ గూటికి చేర్చుకుంది. రాహుల్ చాహర్ రూ.1 కోటి బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. రాహుల్ చాహర్ కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు రూ.5.20 కోట్లకు సీఎస్కే అతడిని దక్కించుకుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రాహుల్ చాహర్ అన్న దీపక్ చాహర్ గతంలో చాలం కాలం పాటు సీఎస్కేలో కీలక బౌలర్‌గా రాణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ్ముడు కూడా అదే జట్టులో చేరడం విశేషం.

రాహుల్ చాహర్ ఐపీఎల్ ప్రయాణం
26 ఏళ్ల రాహుల్ చాహర్ 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో చేరి స్టార్‌గా ఎదిగాడు. 2018-2021 మధ్య కాలంలో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణించి టీమిండియాలో చోటు సంపాదించాడు. 2022లో పంజాబ్ కింగ్స్ జట్టు అతడిని రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడ మూడు సీజన్లలో వరుసగా 14, 8, 10 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం లభించింది.

Brother Footsteps Followed CSK Buys Rahul Chahar for Rs 5 20 Crore in IPL 2026 Auction

మనసులోని మాటను బయటపెట్టిన రాహుల్ చాహర్
వేలానికి ముందే రాహుల్ చాహర్ ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. రాజస్థాన్ తన సొంత రాష్ట్రం కావడంతో రాజస్థాన్ రాయల్స్ (RR) లేదా తన బౌలింగ్ శైలికి సరిపోయే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు."చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నా బౌలింగ్ రికార్డు చాలా బాగుంది. అక్కడ బంతికి లభించే టర్న్ నా బౌలింగ్‌కు బాగా సరిపోతుంది" అని రాహుల్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో రాహుల్ చాహర్ కోరుకున్నట్లుగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని భారీ ధరకు కొనుగోలు చేయడం గమనార్హం.

గణాంకాల ప్రకారం.. రాహుల్ చాహర్ చెపాక్ మైదానంలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 15.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ రాహుల్ చాహర్ ఎకానమీ రేటు కేవలం 6.19 మాత్రమే ఉండటం విశేషం. ఈ అద్భుతమైన ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకునే ధోనీ సేన అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ. 25.20 కోట్లతో కేకేఆర్ జట్టులో చేరి రికార్డు సృష్టించగా.. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను కూడా సీఎస్కే భారీ ధరకు దక్కించుకుంది.

Story first published: Wednesday, December 17, 2025, 12:14 [IST]
Other articles published on Dec 17, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+