న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోదరుడు అరెస్ట్: తొలిటెస్ట్‌కు ముందు ఉస్మాన్ ఖవాజాకి ఊహించని షాక్

Brother Of Australian Cricketer Arrested Over Fake Terror Hit List

హైదరాబాద్: భారత్‌తో టెస్టు సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాకి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల్ని తప్పుదోవ పట్టించిన కేసులో అతని సోదరుడు అర్సాఖాన్ ఖవాజాని మంగళవారం ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇండియా vs ఆస్ట్రేలియా: సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆ ఐదు జోడీలివే!ఇండియా vs ఆస్ట్రేలియా: సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆ ఐదు జోడీలివే!

వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ హత్యకి వర్సిటీలో తన మాజీ సహచరుడు, శ్రీలంకకి చెందిన మహ్మద్ కమీర్ నిజాముద్దీన్ ఉగ్రవాదులతో కలిసి కుట్ర పన్నాడని ఈ ఏడాది ఆగస్టులో అర్సాఖాన్ పోలీసులకు నమ్మించాడు. దీంతో నిజాముద్దీన్‌ని అరెస్టు చేసిన పోలీసులు సుదీర్ఘ విచారణ తర్వాత అతను నిర్దోషిగా తేల్చారు.

దీంతో అర్సాఖాన్ ఖవాజాని అదుపులోకి తీసుకుని రెండు తగిలించగా అసలు విషయం వెల్లడించాడు. ఓ అమ్మాయి విషయంలో చెలరేగిన వివాదం కారణంగానే నిజాముద్దీన్‌ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఖవాజా ఇరికించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

నిజాముద్దీన్‌కి క్షమాపణలు చెప్పిన పోలీసులు అతడికి కోర్టు ఖర్చులను సైతం చెల్లించి మంగళవారం అర్సాఖాన్ ఖవాజాని అరెస్టు చేశారు. అయితే, తన సోదరుడి అరెస్ట్ అడిలైడ్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న తొలి ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది.

ఇటీవల పాకిస్థాన్‌పై సెంచరీ సాధించిన ఉస్మాన్ ఖవాజా గాయం నుంచి కోలుకుని జట్టులోకి మళ్లీ పునరాగమం చేయబోతున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. స్మిత్, వార్నర్ లేకపోవడం... మునుపటి కంటే టీమిండియా బలంగా ఉండటంతో ఈ సిరిస్‌ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది.

Story first published: Tuesday, December 4, 2018, 19:08 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X