Nitish Kumar Reddy: ఐపీఎల్ 2025 సీజన్‍లో భారీ విజయంతో సన్‍రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచులో ఓ ఆసక్తకర విషయం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తన పెళ్లిపై స్పందించాడు.
'మ్యారేజ్ ఎప్పుడు బ్రో'
మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి. అప్పుడు స్టాండ్స్ లో కూర్చొన్న కొంతమంది అభిమానులు.. సన్‌రైజర్స్ కు మద్దతుగా అరుస్తూ కనిపించారు. అదే సమయంలో పలువురు నితీశ్ రెడ్డిని 'మ్యారేజ్ ఎప్పుడు బ్రో' అంటూ గట్టిగా అరిచారు. అమ్మాయిలు సచ్చిపోతున్నారురా అయ్యా, బ్రో లవ్ మ్యారేజా అంటూ తెగ కామెంట్లు చేశారు. దానికి నితీశ్ రెడ్డి లోలోపల సిగ్గుపడుతూ నవ్వుతూ కనిపించాడు. అలాగే కాదు అన్నట్టుగా తల ఊపి సైగ చేశాడు. అలా తన పెళ్లి గురించి మ్యాచ్ మధ్యలోనే క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ చేశాక..
ఈ వీడియో చూసిన ఇంకొంతమంది తెలుగు క్రికెట్ అభిమానులు.. నితీశ్ కు అప్పుడే పెళ్లెందుకు, బాలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ చేశాక చేసుకుంటాడు, కొద్ది రోజులు బ్రతకనివ్వండి బ్రో, కెరీర్ ఈ మధ్యే కదరా వాడు స్టార్ట్ చేసింది అప్పుడే పెళ్లి అని అడుగుతారేంట్రా అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
