సిక్సర్ల వర్షం కురిపించిన ఐర్లాండ్ ప్లేయర్.. సదరన్ బ్రేవ్‌దే టైటిల్! లివింగ్‌స్టన్ మెరుపులు వృధా!

లండన్: ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తొలిసారి నిర్వహించిన 'ది హండ్రెడ్' టోర్నీ విజయవంతంగా ముగిసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా.. పురుషుల, మహిళల విభాగాల్లో టోర్నీని ఒకేసారి నిర్వహించినా ఎలాంటి అవాంతరాలు లేకుండా టోర్నీ ఘనంగా ముగిసింది. శనివారం రాత్రి ముగిసిన హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2021 టైటిల్‌ను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకొగా.. మహిళల టైటిల్‌ను ఓవల్ ఇన్‌విన్సిబుల్స్ జట్టు సొంతం చేసుకుంది. రెండు ఫైనల్ మ్యాచులు రసవత్తరంగా సాగాయి. మైదానంలోని ప్రేక్షకులు ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ ఆటను తెగ ఎంజాయ్ చేశారు.
స్టిర్లింగ్ సిక్సర్ల వర్షం:
లండన్‌లోని లార్డ్స్ వేదికగా శనివారం బర్మింగ్‌హమ్ ఫోనిక్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సదరన్ బ్రేవ్ తొలిసారి 'ది హండ్రెడ్' మెన్స్ చాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్.. 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (7) విఫలమయినా.. ఐర్లాండ్ సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ సిక్సుల వర్షం కురిపించాడు. 36 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 61 రన్స్ చేశాడు. స్టిర్లింగ్ సిక్సర్ల వర్షానికి తోడు.. చివర్లో రాస్ విట్‌లీ (19 బంతుల్లో 44 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో సదరన్ బ్రేవ్ భారీ స్కోర్ చేసింది. అలెక్స్ డేవిస్ (27), టీమ్ డేవిడ్ (15) నిరాశపరిచారు. బర్మింగ్‌హమ్ బౌలర్ ఆడమ్ మిల్నే రెండు వికెట్లు పడగొట్టాడు.
లివింగ్‌స్టన్ పోరాటం సరిపోలేదు:
అనంతరం బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సెమీస్ హీరో లియామ్ లివింగ్‌స్టన్ (19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి మెరుపులు మెరిపించినా.. ఆ పోరాటం సరిపోలేదు. డేవిడ్ బెడింగ్‌హామ్ (0), విల్ స్మెడ్ (2) విఫలమయినా.. మొయిన్ అలీ (36) రాణించాడు. చివర్లో బెంజమిన్ 23, బెన్నీ హౌవెల్ 20 నాటౌట్‌గా నిలిచారు. సదరన్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్, క్రెగ్ ఓవర్‌టన్, టైమెల్ మిల్స్, జేక్ లిన్‌టోట్ తలా ఒక వికెట్ తీశారు. అద్భుత ఇన్నింగ్స్‌తో సదరన్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టిర్లింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కగా.. టోర్నీ ఆద్యంతం నిలకడగా రాణించిన లియాయ్ లివింగ్‌స్టన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
మహిళల విజేత ఓవల్:
శనివారం మధ్యాహ్నం లార్డ్స్ మైదానంలో జరిగిన మహిళల ఫైనల్లో ఓవల్ ఇన్‌విన్సిబుల్స్ 48 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇన్‌విన్సిబుల్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (26), వాన్ నికెర్క్ (26), ఫ్రాన్ విల్సన్ (25) రాణించారు. స్రుబ్ సోలె, బెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్రేవ్ టీమ్ 100 బంతుల్లో 73 పరుగులకే ఆలౌట్ అయింది. 29 పరుగులకే బ్రేవ్ జట్టు 7 వికెట్లు కోల్పోగా.. ఫి మోరిస్ (23) పోరాడింది. టేలర్ (18), నోరిస్ (11) తప్ప మరెవరూ రెండంకెల స్కోర్ అందుకోలేదు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మరిజాన్ కాప్ 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. డేన్ వాన్ నీకెర్క్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచింది.
ఫ్యాన్ స్టన్నింగ్ క్యాచ్:
తాజాగా హండ్రెడ్ టోర్నీలో ఓ అభిమాని స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. సెమీస్ మ్యాచులో లియామ్ లివింగ్‌స్టన్ కొట్టిన ఒక భారీ సిక్స్‌ను మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు స్టన్నింగ్ క్యాచ్‌గా అందుకున్నాడు. బంతి స్టాండ్స్‌లోకి రావడంతో ఆ వ్యక్తి లేచి దానిని అందుకునే ప్రయత్నంలో సీటు నుంచి పక్కకు పడిపోయాడు. అయినా పట్టువిడవకుండా డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. వెనక వరుసలోని సీటు నుంచి ముందు వరుసలోని సీటుకు పడిపోతూ ఆ అభిమాని పట్టిన క్యాచుకు అక్కడి ఫాన్స్ ఫిదా అయ్యారు. కామెంటేటర్లు సైతం ఆ అభిమాని సాహసానికి జై కొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications