బ్రిస్బేన్: గబ్బా మైదానంలో భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ (27)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. 65వ ఓవర్ చివరి బంతికి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అంతకుముందు అర్ధ శతకం వైపు వెళుతున్న కామెరూన్ గ్రీన్‌ను కూడా ఠాకూర్ ఔట్ చేశాడు. 61వ ఓవర్ ఐదవ బంతికి రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టడంతో గ్రీన్ పెవిలియన్ చేరాడు. అతడు 90 బంతుల్లో 37 రన్స్ చేశాడు. దీంతో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది.
ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ వరుస వికెట్లను కోల్పోతూ కష్టాలలో పడింది. డేవిడ్ వార్నర్ (48), మార్కస్ హారిస్ (38), మార్నస్ లబుషేన్ (25), మాథ్యూ వేడ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవీలియన్‌కు క్యూ కట్టడంతో ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే బాధ్యతను స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ తీసుకున్నారు. అయితే 55 పరుగుల వద్ద స్మిత్ ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించిన స్మిత్ (55)ను మొహ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించాడు. బౌన్సర్ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్.. అజింక్య రహానే చేతికి చిక్కాడు. గ్రీన్-స్మిత్ అయిదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
స్టీవ్ స్మిత్ అనంతరం కామెరూన్ గ్రీన్ కూడా పెవిలియన్ చేరాడు. ఆపై కెప్టెన్ టీమ్ పైన్, పాట్ కమిన్స్ మరో వికెట్ పడకుండా కాసేపు అడ్డుకున్నారు. ఆపై పైన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం మిచెల్ స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. కొద్దిసేపటికే చిరుజల్లు రావడంతో ఆట ఆగిపోయింది. దీంతో టీ బ్రేక్ 8 నిమిషాల ముందు ప్రకటించారు. టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 66.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 243 రన్స్ చేసింది. ఆసీస్ ప్రస్తుతం 276 పరుగుల ఆధిక్యంలో ఉంది.క్రీజుల్ కమిన్స్ (2), స్టార్క్ (1) ఉన్నారు.
ISL 2020 21: జంషెడ్‌పూర్‌పై నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం!!