మూడో సెషన్ రద్దు.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!

Brisbane Test: Play called off due to wet outfield, India 62/2 at Stumps
IND vs AUS 4th Test Day 2 Highlights: Play Abandoned Due To Rain || Oneindia Telugu

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముందుగానే ముగిసింది. వర్షం కారణంగా మూడో సెషన్‌ ఆట సాగలేదు. టీ బ్రేక్ అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ సాగేందుకు వీలుకాలేదు. మైదానాన్ని పరిశిలించిన అంపైర్లు.. రెండో రోజు ఆట వీలుకాదని తేల్చేశారు. మూడో రోజు 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో రోజు ముగిసే (టీ బ్రేక్) సమయానికి 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఛెతేశ్వర్‌ పుజారా (8), అజింక్య రహానే (2) క్రీజులో ఉన్నారు.

సైనీ స్థానంలో బౌలింగ్.. రోహిత్‌ను ట్రోల్‌ చేసిన దినేశ్‌ కార్తిక్‌! ఏమైందో తెలియదు కానీ!

ఆదిలోనే భారీ షాక్:

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ ‌గిల్ ‌‌(7; 15 బంతుల్లో 1x4) త్వరగానే పెవిలియన్ చేరాడు. పాట్ కమిన్స్‌ వేసిన 6.2వ ఓవర్‌కు స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 11 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆపై సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ‌(44; 74 బంతుల్లో 6x4), ఛెతేశ్వర్‌ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. రోహిత్ తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆపై వేగం పెంచి టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

భారీ వర్షం కురవడంతో:

అయితే అర్ధ శతకానికి చేరువైన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ‌ను స్పిన్నర్ నాథన్ లైయన్‌ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి.. మిచెల్‌ స్టార్క్‌ చేతికి దొరికిపోయాడు. దీంతో భారత్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ ఔటైన తర్వాత కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్‌కు దిగాడు. పుజారా, రహానే మెల్లగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెల్లారు. క్రీజ్‌లో పాతుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ.. ఆసీస్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఈ జోడి 37 బంతుల్లో రెండు పరుగులు చేసింది. టీ బ్రేక్ సమయానికి 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిపోయింది.

369 పరుగులకు ఆలౌట్:

369 పరుగులకు ఆలౌట్:

అంతకుముందు జట్టు స్కోర్ 274/5 పరుగుల దగ్గర రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. 369 పరుగులకు ఆలౌట్ అయింది. మరో 95 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్నస్ లుబుషేన్ శతకం (108)తో రాణిస్తే.. కెప్టెన్ టిమ్ పైన్ హాఫ్ సెంచరీ (50) చేశాడు. కామెరాన్ గ్రీన్ (47), మాథ్యూ వేడ్ (45) పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, శార్దూల్ ఠాకుర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. మొహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.

సైనీ స్థానంలో బౌలింగ్.. రోహిత్‌ను ట్రోల్‌ చేసిన దినేశ్‌ కార్తిక్‌! ఏమైందో తెలియదు కానీ!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, January 16, 2021, 13:04 [IST]
Other articles published on Jan 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X