
బ్యాట్‌ను వదిలేసిన బౌలర్:
గురువారం గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరీకేన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాట్ రెన్‌షా బౌండరీ వద్ద అథ్లెటిక్ విన్యాసాలు చేసి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఘటన కూడా చోటుచేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా 18వ ఓవర్‌లో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ హీట్ బౌలర్ జోష్ లాలోర్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని స్టంప్స్‌కు దూరంగా జరిగి ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ ఆడే క్రమంలో ఖైస్ చేతిలోంచి బ్యాట్ జారిపోయింది. ఆ బ్యాట్ గాల్లో గిర్రున తిరిగి కొంచెం దూరంలో పడింది.

గబ్బాలో బ్యాట్‌లు ఎగురుతున్నాయి:
ఈ ఘటనతో ఖైస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా చిరునవ్వులు చిందించారు. మరోవైపు మైదానంలోని అభిమానులు సందడి చేశారు. బ్రిస్బేన్ ఆటగాడు కిందపడిన బ్యాట్‌ను తీసుకుని ఖైస్‌కు ఇచ్చాడు. 'గబ్బాలో బాల్‌కు బదులు బ్యాట్‌లు ఎగురుతున్నాయి' అంటూ నవ్వుతూ ఖైస్‌తో అన్నాడు. ఖైస్ నవ్వేసి బ్యాట్ తీసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు నవ్వులు పూయిస్తున్నారు.

బ్రిస్బేన్ విజయం:
ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్‌పై బ్రిస్బేన్ హీట్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూ వేడ్ (61) అర్ధ సెంచరీ చేసాడు. జోష్ లాలోర్ మూడు వికెట్లు తీసాడు. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 18.2 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. బెన్ కటింగ్ (43) విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రెన్‌షా అద్భుత క్యాచ్:
ఈ మ్యాచ్‌లో రెన్‌షా బౌండరీ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. వేడ్ అప్పటికే మంచి ఊపుమీదున్నాడు. ఇదే ఊపులో బెన్ కటింగ్ వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడాడు. బంతి బౌండరీ లైన్ లోపల పడుతుండగా.. పరుగెత్తుకెళ్లిన రెన్‌షా బంతిని అందుకున్నాడు. ఆ వెంటనే బ్యాలెన్స్ తప్పడంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ దాటాడు. బంతి తిరిగి బౌండరీ లోపలే పడబోతుండగా.. రెన్‌షా మళ్లీ గాల్లోకి ఎగిరి బంతిని మైదానంలోకి విసిరాడు. అక్కడే ఉన్న మరో ఫీల్డర్ (టామ్ బాంటన్) బంతిని అందుకున్నాడు.


Click it and Unblock the Notifications












