వరుసగా రెండోసారి: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ టైటిల్ గెలిచిన బ్రిస్బేన్ హీట్

హైదరాబాద్: మహిళల బిగ్ బాష్ లీగ్ విజేతగా బ్రిస్బేన్ హీట్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్ స్ట్రయికర్స్ జట్టుపై బ్రిస్బేన్ హీట్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండో సీజన్‌లో టైటిల్ సాధించిన జట్టుగా బ్రిస్బేన్ హీట్ జట్టు అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రయికర్స్ వెల్లింగ్టన్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా.... తాహిలా మెక్‌గ్రాత్ (33), సారథి బేట్స్ (27) ఫరవాలేదనిపించారు. బ్రిస్బేన్ బౌలర్లలో జార్జియా, జెస్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ 18.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ బెత్ మూనీ (56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అడిలైడ్ బౌలర్లలో తాహిలా మెక్‌గ్రాత్ రెండు వికెట్లు తీసింది.
Story first published: Monday, December 9, 2019, 10:57 [IST]
Other articles published on Dec 9, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications