
హైదరాబాద్: 'వరల్డ్‌కప్‌కు ఇంటికి తీసుకురండి' అని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన ట్విట్టర్‌లో జట్టు సభ్యులకు సూచించాడు. వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది జట్టు సభ్యుల్లో తప్పక చోటు దక్కించుకుంటాడని భావించిన రిషబ్ పంత్‌కు ఆఖరి నిమిషంలో నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరల్డ్‌కప్‌కు ముందు బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీసేన 95 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా.. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుంజుకుంది. ఓపెనర్లు విఫలమైనా.. కెప్టెన్ కోహ్లీ, రాహుల్, ధోనీలు చెలరేగారు.
ముఖ్యంగా రాహుల్, ధోనీలు సరైన సమయంలో సెంచరీలు సాధించి భారీ స్కోర్ అందించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ తన ట్విట్టర్‌లో "జాతికి ప్రాతినిథ్యం వహించే క్రమంలో బ్లూ జెర్సీ ధరించినపుడు కలిగే భావన.. జట్టుని విష్ చేయడంలోనూ కలుగుతుంది. ఇలాగైనా టీమ్‌కు దగ్గరగా ఉండొచ్చు. కప్‌ని ఇంటికి తీసుకురండి బాయ్స్! గుడ్‌లక్" అంటూ ట్వీట్ చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఆని ఎదురు చూస్తోన్న ఈ మెగా టోర్నీ ఇంగ్లాండ్ వేదికగా మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా టీమిండియా తన ఆరంభ మ్యాచ్‌ని జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరేట్ జట్టలో టీమిండియా ఒకటి.
వరల్డ్‌కప్‌లో ఆడనున్న టీమిండియా:
విరాట్‌కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విజయ్ శంకర్, దినేశ్ కార్తిక్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కేదార్ జాధవ్.