Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపిఎల్-4 కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా బ్రయాన్ లారా...

Brian Lara
రిటైరై చాలాకాలం ఇంటి పట్టునే ఉన్న విండీస్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా మళ్ళీ మెరవనున్నాడు. తన బ్యాటింగ్‌ సొగసును ఐపీఎల్‌ కు పంచనున్నాడు. ఇవాళ జరిగే ఫ్రాంఛైజ్‌ కు లారాయే సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ గా మారాడు. ప్రపంచ క్రికెట్‌ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్‌ కు సన్నాహాకాలు మొదలయ్యాయి. ఇవాళ, రేపు నాలుగో సీజన్‌ కు సంబంధించి ఆటగాళ్ళ వేలానికి రంగం సిధ్దమైంది.

బెంగుళూర్ వేదికగా ఈ ఆక్షన్ జరగబోతోంది. పలువురు ప్రపంచ మేటి ఆటగాళ్లు ఈ ఆక్షన్‌ లో పాల్గొంటున్నారు. అయితే ఎంతమంది వస్తున్నా అందరి దృష్టి వెస్టిండీస్‌ కు చెందిన బ్రయాన్‌ లారా మీదే వుంది. సొగసైన బ్యాటింగ్‌ తో తనకు మాత్రమే సాధ్యమనిపించే పలు రికార్డులు సృష్టించిన 41 ఏళ్ల లారా ఐపీఎల్‌ లో ఆడటం ద్వారా మరో కొత్త అద్యాయానికి తెరలేపేందుకు సిద్దమవుతున్నాడు. ఇతని ధర రెండు కోట్లు పలుకుతుందని అంచనా.

అదే జరిగితే అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన విదేశీ అటగాడుగా చరిత్ర సృష్టిస్తాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఓనర్‌ షారూక్‌ ఖాన్‌ లారా పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. సహారా పూనే వారీయర్స్‌, ముంబై ఇండియాన్స్‌ కూడా ఈ లిజెండ్‌ కోసం పోటీ పడనున్నాయి. ఇంత లేటు వయస్సులోనూ తనకు డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదని లారా నిరూపించుకుంటున్నాడు.

బేస్ ప్రైస్ 4 లక్షల డాలర్లు. లారాను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో గత రికార్డులు బద్దలయ్యే అవకాశాల కనిపిస్తున్నాయి. ఈసారి వేలంలో ప్రధానంగా విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, డ్వయాన్ బ్రేవో, ఆసీస్ క్రికెటర్ షాన్ మార్ష్, ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్‌తో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు స్పెషల్ ఎట్రాక్షన్‌ గా నిలవనున్నారు.

2007 వరల్డ్‌ కప్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుండి రిటైర్‌ మెంట్‌ ప్రకటించిన లారా రెండేళ్ల పాటు పూర్తిగా కుటుంబంతోనే గడిపాడు. ఇటీవలే జింబాబ్వేలో టి-20 లీగ్‌ ఆడటం ద్వారా మళ్ళీ రంగ ప్రవేశం చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+