వార్నర్ నా రికార్డును అధిగమిస్తాడనుకున్నా.. మరో అవకాశంలో 400 తప్పక సాధిస్తాడు: లారా

అడిలైడ్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నా రికార్డును అధిగమిస్తాడనుకున్నా. కానీ అతనికి ఆ అవకాశం రాలేదు. అయినా సరే వార్నర్‌కు మరో అవకాశం లభిస్తుంది. అప్పుడు 400 పరుగులు తప్పక సాధిస్తాడని అనుకుంటున్నా అని వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారా అన్నారు. పాకిస్తాన్‌తో ముగిసిన రెండో (డే/నైట్) టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్నర్ (335 నాటౌట్; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు:
1994లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో గ్యారీ సోబర్స్ (365) అత్యధిక వ్యక్తిగత టెస్ట్ పరుగుల రికార్డును లారా (375) బద్దలు కొట్టాడు. మళ్లీ 2004లో లారా 400 పరుగులు చేశాడు. అడిలైడ్ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో వార్నర్ 335 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లారా 400 పరుగుల రికార్డును వార్నర్ అధిగమిస్తాడని అందరూ భావించినా.. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో అది సాధ్యపడలేదు. అయితే బ్రాడ్‌మన్ (334) రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు.

నా రికార్డును అధిగమిస్తాడనుకున్నా:
తాజాగా లారా మాట్లాడుతూ... 'వార్నర్ నా రికార్డును దాటేస్తాడని భావించా. నా రికార్డును అందుకొనేందుకు అతడికి అనుమతి ఇస్తారనుకున్నా. కానీ అతనికి ఆ అవకాశం రాలేదు. నేను సోబర్స్ ఘనతను దాటేసినప్పుడు అద్భుతంగా అనిపించింది. రికార్డులు బద్దలు కొట్టడానికే. దూకుడన ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొడితే గొప్పగా ఉంటుంది' అని అన్నాడు.

వార్నర్‌కు మరో అవకాశం లభిస్తుంది:
'ప్రస్తుతం నేను అడిలైడ్‌లోనే ఉన్నా. వార్నర్‌ను కలిసి అభినందనలు తెలియజేస్తా. వార్నర్‌కు మరో అవకాశం లభిస్తుంది. అప్పుడు 400 పరుగులు తప్పక సాధిస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే.. 300 పరుగులు చేసిన వాడికి 400 చేయడమెలాగో తెలుసు. ఇలాంటి అవకాశం మళ్లీ అతనికి రావాలనుకుంటున్నా' అని లారా పేర్కొన్నారు.

వారు ఆటను శాసిస్తారు:
'వార్నర్, రిచర్డ్స్ లాంటి ఆటగాళ్లు జట్టు విజయానికి కావాల్సిన ఇన్నింగ్స్ ఆడతారు. వారు ఆటను శాసిస్తారు. బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు చేసిన తర్వాత వార్నర్ నా రికార్డు వైపు రావడం ఆనందంగా అనిపించింది. అతడి ఇన్నింగ్స్ ముగిసేలోపు మైదానానికి రావాలని ప్రయత్నించా. అతడు మాథ్యూ హెడేన్ 380 రికార్డు తుడిచేస్తాడా అని వ్యాఖ్యతలు అనడం విన్నా. 381 చేస్తే కచ్చితంగా 400 చేస్తాడనిపించింది' అని లారా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications