'కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్‌కు నాయకుడు, సంతోషంగా ఉంది'

హైదరాబాద్: నవంబరు5న 30వ పడిలోకి అడుగుపెట్టి పుట్టిన రోజు వేడుకల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీని తెగపొగిడేస్తున్నాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా. ఇటీవల కోహ్లీ కొనసాగిస్తోన్న ఫామ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీ ఆటతీరుపై సందేహిస్తూ ఈ తరం క్రికెట్‌కు ఓ నాయకుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.

వేగం, ఫిట్‌నెస్, వేర్వేరు అంశాలకు కోహ్లీ..
'కోహ్లీ ఈ రోజు సాధిస్తున్నవి అసాధారణ ఘనతలు. అతడి పరుగుల వేగం, ఫిట్‌నెస్, వేర్వేరు అంశాలకు అతనిస్తున్న ప్రాముఖ్యం అద్భుతం. ప్రస్తుతం క్రికెట్‌కు ఓ నాయకుడు దొరికినందుకు సంతోషం' అని లారా అన్నాడు. కృష్ణపట్నం గోల్ఫ్ ఛాంపియన్ షిప్ నాలుగో ఎడిషన్‌లో బిజీగా ఉన్న లారా శనివారం పీటీఐతో సమావేశమైయ్యాడు.

సచిన్-కోహ్లీలలో ఎవరు గొప్ప అనే విషయంపై
అదే క్రమంలో సచిన్-కోహ్లీలలో ఎవరు గొప్ప అనే విషయంపై చర్చించేందుకు నిరాకరించాడు. సచిన్‌కు లారాకు పోల్చేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటారు. అందులో మాకేమీ అభ్యంతరం లేదు. వేర్వేరు తరాల్లో ఆడుతున్న క్రికెటర్లకు పోలిక పెట్టొదన్నాడు. కోహ్లీ కూడా సచిన్‌తో పోల్చినంత మాత్రాన దానిని అతను పరిగణించి వేరేలా భావించడని తెలిపాడు.

విండీస్ క్రికెట్ గురించి సచిన్ విచారం
వివ్ రిచర్డ్స్, గ్యారీఫీల్డ్ సోబర్స్, టెండూల్కర్, రికీ పాంటింగ్‌లో ఎవరు గొప్పంటే ఏం చెప్తారని ప్రశ్నించాడు. దిగ్గజాల ఆటను స్ఫూర్తిగా తీసుకొని తామంతా ముందుకు వెళ్లామని తెలిపాడు. విండీస్ క్రికెట్ గురించి సచిన్ విచారం వ్యక్తం చేశాడని లారా పేర్కొన్నాడు. కోచింగ్‌లో నాణ్యత లోపించడం సైతం విండీస్ క్రికెట్‌ను దెబ్బతీసిందని లారా అభిప్రాయపడ్డాడు.

సచిన్‌ను కలిసినప్పుడు గోల్ఫ్ కాకుండా
తాను ముంబైలో సచిన్‌ను కలిసినప్పుడు గోల్ఫ్ గురించే కాకుండా క్రికెట్‌కు సంబంధించి ఎన్నో విషయాలు చర్చించామన్నాడు. ఒకప్పటి విండీస్ స్ఫూర్తి ప్రస్తుత జట్టులో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడన్నాడు. ఆటగాళ్లు దేశం తరఫున కాకుండా లీగుల్లో ఫ్రాంచైజీలకు ఆడటంపై ఆసక్తి చూపడం తగదని పేర్కొన్నాడు. అయితే క్రికెటర్లకు తక్కువ డబ్బులు లభిస్తుండటంపై బయట సంపాదనకు ఆసక్తి చూపడాన్ని మాత్రం తప్పుపట్టలేదని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications