Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కోహ్లీని తక్కువ చేసి మాట్లాడే వారికి మాజీ లెజెండ్ సూటి సమాధానం!

World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోవడాన్ని ఇంకా ఫ్యాన్స్ మర్చిపోలేదు. అదే సమయంలో ఈ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆడిన ప్రతి మ్యాచులోనూ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఈ క్రమంలోనే మెగాటోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఏడు వందల పరుగుల మార్కు దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కానీ జట్టుకు ట్రోఫీ మాత్రం అందించలేకపోయాడు. అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న తర్వాత కనీసం స్పీచ్ కూడా ఇవ్వలేకపోయిన అతను.. అట్నుంచి అటే డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయాడు.

Brian Lara lauds Virat Kohli performance during World Cup

అతను ఇంత బాగా ఆడినా కూడా చాలా మంది కోహ్లీపై విమర్శలు చేశారు. కోహ్లీ ఎంత ఆడినా కప్పు రానప్పుడు ఏం ఉపయోగం అని అతని ఆటను తక్కువ చేశారు. దీనిపై వెస్టిండీస్ లెజెండ్ బ్రయాన్ లారా స్పందించాడు. చాలామంది కోహ్లీని తక్కువ చేస్తారని, కానీ అలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.

'భారత్ ట్రోఫీ గెలవలేదు కాబట్టి కోహ్లీ ఎంత బాగా ఆడినా ఏం ప్రయోజనం? అని చాలా మంది అంటారు లేదా అనేసే ఉంటారు. అది నాకు తెలుసు. టీం స్పోర్ట్ లక్ష్యం గెలవడం, జట్టులో ప్లేయర్‌గా జట్టును గెలిపించడమే మన అంతిమ లక్ష్యం. కానీ జట్టు గెలవాలంటే వ్యక్తిగతంగా మనం కూడా మెరుగ్గా ఆడాలి కదా' అని బ్రయాన్ లారా అన్నాడు.

'ఆ వ్యక్తిగత ప్రదర్శనే మ్యాచ్ తర్వాత మ్యాచ్.. ఇలా టోర్నీ ఆసాంతం కోహ్లీ తన టీంకు అందించాడు. అతని లెగసీని మనం గుర్తుంచుకోవాలి. తను మ్యాచ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతాడో చూపించి క్రికెట్ ముఖచిత్రాన్నే కోహ్లీ మార్చేశాడు. అతని డిసిప్లిన్ ఎప్పుడూ కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది' అని లారా అన్నాడు.

Story first published: Friday, December 1, 2023, 16:12 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+